కొనసాగుతున్న పంచాయతీ కార్మికుల రిలే నిరహార దీక్షలు.
నెన్నెల, జూలై 10, (జనంసాక్షి) నెన్నెల మండల కేంద్రంలో మండల వ్యాప్తంగా పంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మె బాట పట్టారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. ఈసందర్భంగా పంచాయతీ కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు లేతకారి కుమార్ ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం స్వచ్భ భారత్ లో ముందు ఉందని చెప్పే పాలకులు కార్మికుల గురించి పట్టించుకొనే నాథుడే కరువాయ్యడని ఎద్దేవా చేశారు. కరోనా కాలంలో ప్రతి గ్రామపంచాయతీ కార్మికుడు ప్రాణలకు తెగ్గించి సేవలు చేసిన, కార్మికుల ఆరోగ్యానికి రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు విఫలం అయ్యాయన్నారు. చీపురు పట్టుకొని స్వచ్ భారత్ ఫోటో లు దిగే ప్రధానమంత్రికి కార్మికుల కష్టాలు కనబడటం లేదా అన్నారు. మరో వైపు కేసీఆర్, కేటీఆర్ కార్మికులను పట్టించు కోవడం లేదని కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబానికి 10లక్షల నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించాలని కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిలుగా నియమించాలని అన్నారు. జాతీయ అర్జీత సెలవు దినాలు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కోనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షుడు తోట వెంకటేశం, కార్యదర్శి బత్తిని మల్లాగౌడ్, కోశాధికారి తలండి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గట్టు అరుణ్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్ప వెంకటేష్, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.