క్షేత్రస్థాయిలో పంటపొలాల పరిశీలన
వేములవాడ రూరల్, ఆగస్టు 10 (జనంసాక్షి): ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు గురువారం వేములవాడ గ్రామీణ మండలంలోని మల్లారం, హనుమాజీపేట గ్రామాలలోని పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధిక వర్షాల వల్ల ప్రత్తిలో వేరు కుళ్ళు,ఆకుపచ్చ,రసం పీల్చే పురుగుల ఉధృతిని గుర్తించినట్లు తెలిపారు. అలాగే వరిలో ప్రధానంగా వచ్చే మొగి పురుగు లక్షణాలను వివరించి చేపట్టవలసిన నివారణ చర్యలను రైతులకు వివరించారు. క్షేత్ర సందర్శనలో వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ శాస్త్రవేత్తలు డా.ఉషారాణి, డా.రాజేంద్రప్రసాద్, RAWEP విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.