గల్లంతయిన భార్య ఆచూకీ కోసం ఆరా

అమరావతి,మే5(జ‌నం సాక్షి): గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకూ రాయలసీమ సహా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. చిత్తూరు జిల్లాలో పిడుగులు పడడంతో ముగ్గురు మృతిచెందారు. తొట్టంబేడు మండలం ఎగువ సాంబయ్యపాళెంకు చెందిన దగ్గోలు గురవారెడ్డి (45), దగ్గోలు దశరథరెడ్డి (28) మునీంద్రరెడ్డి(23) దగ్గరి బంధువులు. వీరు గొర్రెలు కొనుగోలు కోసం పలు గ్రామాలు తిరిగి అర్ధరాత్రి వేళ శ్రీకాళహస్తికి వస్తూ శివార్లలోని ఆర్‌సిపి ఇంగ్లీష్‌ విూడియం వద్ద ఓ చెట్టు వద్ద ఆగారు. ఆ సమయంలో పిడుగులు పడడంతో ముగ్గురూ మృతిచెందారు.  విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు, సరియాపల్లి గ్రామాల్లో  ఈదురుగాలుల బీభత్సానికి 15 ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో, చిమ్మచీకట్లో గాలుల ఉధృతికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలు అల్లాడారు. పలువురికి స్వల్పగాయాలయ్యాయి. ఇంట్లోని పంట , ఆహారధాన్యాలు తడిసి ముద్దయ్యాయి.ప్రకాశం జిల్లా పెద్దార వీడు మండలం కొండవాగు నేలవాగు కలిసే ప్రాంతంలో గురువారం భార్యభర్తలు ఇండ్లా రామసుబ్బారెడ్డి (60), ఇండ్లా లక్ష్మీనారాయణమ్మలు గల్లంతయ్యారు. భర్త మృతదేహం శుక్రవారం తెల్లవారుజామున లభ్యమైంది. భార్య ఆచూకీ లభ్యం కాలేదు.

తాజావార్తలు