గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి
ఏలూరు,మే12(జనం సాక్షి): అన్ని పంటలకు ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి గిట్టుబాటు ధరలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. గిట్టుబాటు ధరనలపై గతం/-లోనే ప్రధాని మోడీ ఈ విధమైన ప్రతిపాదన తెచ్చారని అన్నారు. ఇచ్చిన హావిూలను అమలు చేయడం ద్వారా రైతులకు కేంద్రం అండగా నిలవాలని అన్నారు.
రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, మహిళలు, ప్రజలకు నష్టం కలిగించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ఈనెల 17 నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రచార యాత్రలు చేపట్టాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ప్రచార యాత్రల అనంతరం ఈనెల 23న భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని కోరారు. మహిళలపై దాడులు, అత్యాచారాలను అరికట్టాలన్నారు. ఇళ్లులేని వారందరికీ ఇళ్లు, రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండుచేశారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హావిూలో 250 రోజులు పనిదినాలు కల్పించి, రోజుకు రూ.50లు కనీస వేతనం ఇవ్వాలని కోరారు.