గీతికాశర్మ హత్య కేసులో వాయిదా పడిన కందా ముందస్తు బెయిలు పిటిషన్‌

న్యూఢిల్లీ: హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ గోయల్‌ కందా ముందస్తు బెయిలు పిటిషన్‌పై తీర్పును మంగళవారం ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. గీతికాశర్మ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు తెలుసుకునేందుకు కందాను తమ కస్టడీకి ఇవ్వాలని బెయిలు మంజూరు చేయొద్దని పోలీసులు కోర్టును కోరారు. మరోవైపు కందాపై సెక్షన్‌ 306 కింద ఎలాంటి కేసు నమోదు కాలేదని ఆయన తరపు న్యాయవాది కేటీఎస్‌ తులసి పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ పీకే బాసిన్‌, కందా ముందస్తు బెయిలు పిటిషన్‌పై తీర్పును వాయిదా వేశారు. ముందస్తు బెయిలు కోసం ఢిల్లీహైకోర్టును ఆశ్రయించారు.

తాజావార్తలు