గుంటూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం.. రాజధాని సోకులు

గుంటూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం.. రాజధాని సోకులు సంతరించుకుంటున్నది. ఇంతవరకు మంత్రులు, వివిధ శాఖల ఉన్నత స్థాయి అధికారులకు విడిది కేంద్రంగానే ఉన్నది. అయితే దసరా రోజున రాజధాని శంకుస్థాపనకు వచ్చే వీవీఐపీలకు ఈ అతిథి గృహం విడిదిగా మారనున్నది. సింగపూర్‌, జపాన్‌, భారత్‌ ప్రధానులు రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నట్లు సెక్రటేరియట్‌లోని ప్రొటోకాల్‌ విభాగం నుంచి కలెక్టరేట్‌కు సమాచారం అందింది. ముగ్గురు ప్రధానులతో పాటు వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, సుమారు 15 మంది కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. జడ్‌, జడ్‌ ప్లస్‌ కేటగిరీ నాయకులు సుమారు 30-40 మంది వస్తారనే సమచారం అందింది. దీంతో గుంటూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని ఆధునీకరిస్తున్నారు. ఆ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో 3-4 రోజుల నుంచి చురుగ్గా పనులు సాగుతున్నాయి. ప్రధాని మోదీ నేరుగా గుంటూరు పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుని ఇక్కడ నుంచి రాజధాని భూమి పూజ ప్రాంతానికి వెళ్తారని అధికారులకు సమాచారం అందింది. రాజధాని అమరావతి 2016 ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాల కోసం ఆధునిక సౌకర్యాలతో అతిఽథి గృహాన్ని ఆర్‌ అండ్‌బీ అధికారులు తీర్చి దిద్దుతున్నారు.

తాజావార్తలు