గుంటూరు మిర్చయార్డులో ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్
గుంటూరు: మిర్చియార్డులో తప్పతాగి ఇద్దరు ఉద్యోగులు గలాటా సృష్టించారు. మిర్చియార్డు కార్యదర్శి నరహరి ఛాంబర్‌లోకి ప్రవేశించి ఆసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహం చెందిన కార్యదర్శి ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చోద్యం చూస్తున్నారా అంటూ భద్రతా సిబ్బందిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేసిన ఉన్నతాధికారులు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.