గుంటూరు మీదగా కాచీగూడ – కాకినాడ టౌన్ – కాచీగూడ ప్రత్యేక రైళ్లు
గుంటూరు: దసరా పండగ రద్దీ దృష్ట్యా గుంటూరు మీదగా కాచీగూడ – కాకినాడ టౌన్ – కాచీగూడ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించినట్లు గుంటూరు సీనియర్ డీసీఎం కే ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబర్ 07425 కాచీగూడ – కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు ఈ నెల 20వ తేదీన రాత్రి 10.45 గంటలకు బయలుదేరి గుంటూరుకు మరుసటి రోజు వేకువజామున 4.50 గంటలకు, ఉదయం 10.10 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకొంటుంది. నెంబర్ 07426 కాకినాడ టౌన్ – కాచీగూడ ప్రత్యేక రైలు ఈ నెల 21వ తేదీన సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు గుంటూరుకు చేరుకొని మరుసటి రోజు వేకువజామున 4.30 గంటలకు కాచీగూడ చేరుకొంటుంది. ఏసీ టూటైర్, రెండు త్రీటైర్, ఆరు జనరల్ సెకండ్ క్లాస్, రెండు ఎస్‌ఎల్‌ఆర్ కోచ్‌లుంటాయని సీనియర్ డీసీఎం తెలిపారు.