గుంటూరు మీదగా సికింద్రాబాద్‌-గౌహతి ప్రత్యేక రైళ్లు

గుంటూరు,  దసరా పండుగ రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌ – గౌహతి – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లను గుంటూరు మీదగా నడపాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు గుంటూరు సీనియర్‌ డీసీఎం కే.ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబర్‌ 07149 సికింద్రాబాద్‌- గౌహతి ప్రత్యేక రైలు ఈ నెల 25, అక్టోబర్‌ 2, 9, 16, 23, 30(శుక్రవారం) తేదీల్లో ఉద యం 7.30 గంటలకు బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి మీదగా మధ్యాహ్నం 12.40 గంటలకు గుంటూరు చేరుకొంటుంది. అనంతరం విజయవాడ, విశాఖపట్టణం, భువనేశ్వర్‌ మీదగా శనివారంలో ఉదయం 8.15 గంటలకు గౌహతి చేరుకొంటుంది. నెంబర్‌ 07150 గౌహతి-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 21, 28, అక్టోబర్‌ 5, 12, 19, 26, నవంబర్‌ 2(సోమవారం) తేదీల్లో ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు బుధవారం ప్రారంభ గడియల్లో 2.35 గంటలకు గుంటూరు చేరుకొని ఉద యం 9.30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. ఈ అవకాశాన్ని డివిజన్‌ ప్రయాణీకులు వినియోగించుకోవాలని సీనియర్‌ డీసీఎం విజ్ఞప్తి చేశారు.

తాజావార్తలు