గుండె సంరక్షణపైశ్రద్ధ చూపాలి
గుంటూరు (మెడికల్): గుం డె ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని రమేష్ హాస్పిటల్స్ అధినేత, కార్డియాలజిస్ట్ డాక్టర్ పీ రమేష్‌బాబు కోరారు. వరల్డ్ హార్డ్ డే పురస్కరించుకు రమేష్ హాస్పిటల్స్‌లో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుతున్న జీవనశైలితో గుండె జబ్బు మరణాలు పెరుగుతున్నాయన్నారు. బీపీ, షుగర్, అధిక కొలెసా్ట్రల్‌తో పాటు గుండె రక్తనాళాల్లో పేరుకొనే క్యాల్షియం కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణమన్నారు. మంచి ఆహారపు అలవాట్లు, యోగా, వ్యాయా మం, ఆరు నెలలకు ఒకసారి బీపీ, షుగర్, కొలెసా్ట్రల్, ట్రైగ్లిజరైడ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చన్నారు. రమేష్ హాస్పిటల్స్‌లో ఐదు సంవత్సరాల గుండె వారంటీ పథకం ఉందని తెలిపారు. తల్లి గర్భంలోనే శిశువు గుండె ఆరోగ్యాన్ని బేరీజు వేసి అత్యాధునిక ఎఫినిటీ 70 సీరిస్ ఎకో మిషన్ ద్వారా ఎకో కార్డియోగ్రామ్ పరీక్షలు అందుబాట్లో ఉన్నట్లు తెలిపారు. గుంటూరు, విజయవాడ, ఏలూరులో ఉన్న తమ ఆస్పత్రుల ద్వారా 12,500 గుండె శస్త్రచికిత్సలు, 61 వేల యాంజియోగ్రామ్ పరీక్షలు, 9500 యాంజియోప్లాస్టిలు, 956 ప్రైమరీ పీటీసీ ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు.
వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని మంగళవారం రాత్రి ఎల్‌వీఆర్ క్లబ్‌లో డాక్టర్ పీ రమేష్‌బాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కార్యదర్శి కందిమళ్ల నాగేశ్వరరావు, కోశాధికారి దేవరశెట్టి సత్యనారాయణ(చిన్ని), డాక్టర్ డీఎస్ రాజునాయుడు, డాక్టర్ ఎన్ కిషోర్, డాక్టర్ బీవీఎన్‌వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.