గుండ మల్లేష్ మెమోరియల్ ట్రస్ట్ ను ప్రారంభించిన ప్రముఖులు…

మహిళా సాధికారత విద్యా ఉపాధికి పెద్దపీటవేస్తామన్న చైర్మన్ సమత…….

మెమోరియల్ ట్రస్టు లోగోను ఆవిష్కరించిన రమేష్ రాథోడ్, బోడ జనార్ధన్…………….మల్లేష్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టిన మాజీ ప్రజా ప్రతినిధులు……

అమరజీవి గుండ మల్లేష్ మెమోరియల్ ట్రస్ట్ ను మాజీ మంత్రివర్యులు బోడ జనార్ధన్ మాజీ పార్లమెంటు సభ్యులు రమేష్ రాథోడ్ లు శుక్రవారం బెల్లంపల్లి సింగరేణి కళా వేదికలో ప్రారంభించారు. అమరజీవి గుండా మల్లేష్ మూడో జయంతి సందర్భంగా సింగరేణి కళా వేదికలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆ ట్రస్టు లోగోను ఆవిష్కరించి ఆ ట్రస్టుకు చైర్మన్ గా ఉన్నటువంటి గుండ మల్లేష్ కుమార్తె గుండ సమతకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అమరజీవి గుండ మల్లేష్ మూడో జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ
గుండ మల్లేష్ ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థని కీర్తించారు. అనుక్షణం, ప్రతి నిమిషం ప్రజల కోసం పరితపించిన ప్రజల మనిషి గుండ మల్లేష్ నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు నిలువెత్తు రూపమని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా తన జీవితాంతం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి విలువలతో జీవించిన మహోన్నత వ్యక్తని, శత్రువును సైతం ప్రేమించే గొప్ప మనసున్న వ్యక్తి కాబట్టే అజాత శత్రువుగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. నాలుగు మార్లు శాసనసభ్యుడిగా గెలిచి ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల అభివృద్ధిలో తనదైన ముద్రను వేసుకున్నారని, తుది శ్వాస విడిచే వరకు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కొరకే జీవించారని వివరించారు. చనిపోయే గంట ముందు కూడా ప్రజా సమస్యలపై కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రజల మధ్యనే కుప్ప కూలిపోయారని, ఇలా తుది శ్వాస వరకు ప్రజల శ్రేయస్సు కోసం పరితపించిన గుండ మల్లేష్ భౌతికంగా దూరమై మూడు సంవత్సరాలు అవుతున్న ఇంక ప్రజల గుండెల్లో సజీవంగానే ఉన్నారన్నారు.
అసమానతలు లేని సమాజ నిర్మాణం కావాలని, ఈ ప్రాంతం విద్యా వైద్యంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన మా తండ్రి గారి ఆశయ సాధన కోసం ఆయన పేరిట ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని గుండా సమత తెలిపారు.
గుండ మల్లేష్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత, స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, విద్య, వైద్యం, అన్నార్తులకు చేయూతలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు సంజీవరావ్,
మాజీ శాసనసభ్యులు అమరాజుల శ్రీదేవి రాజేశ్వర్, ఎం సిపిఐ యు కేంద్ర కమిటీ సభ్యులు సబ్బని కృష్ణ , కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ కాంపెల్లి ఉదయ కాంత్, కాంగ్రెస్ జిల్లా నాయకులు న్యాతరి స్వామి, యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వలీవుల్లా ఖాద్రి, సిపిఐ రాష్ట్ర నాయకులు చిప్ప నరసయ్య, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పుల్లల రవికుమార్, ఎన్ఐడబ్ల్యూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొల్లం పూర్ణిమ, సిపిఐ పట్టణ కార్యదర్శి దాసరి శ్రీధర్, మాల మహానాడు సంఘం రాష్ట్ర కార్యదర్శి సొల్లు లక్ష్మి, తెలంగాణ అమరుల ఐక్య సాధన సమితి అధ్యక్షులు ఈడుగు రంజిత్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సమ్మయ్య బిజెపి రాష్ట్ర నాయకులు పాల్వాయి హరీష్, ఆత్మ రాంనాయక్, శ్రీకాంత్, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు………..(ప్రత్యేకప్రతినిధి/ జనం సాక్షి )

తాజావార్తలు