గృహలక్ష్మి పథకానికి అందించే ఆర్థిక సాయం రూ. 5 లక్షలకు పెంచాలి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూర సమ్మయ్య ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత
జనంసాక్షి, కమాన్ పూర్ : గృహలక్ష్మి పథకానికి అందించే ఆర్థిక సాయం రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కేషోరామ్ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు సూర సమ్మయ్య డిమాండ్ చేశారు. ఏఐసీసీ కార్యదర్శి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు గురువారం సూర సమ్మయ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి తహసిల్దార్ కు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క నీరుపేదకు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజురు చేయలేదు..
ఇంటి జాగా లేని పెదవారికి ఇంటి జాగా కూడా ఇవ్వలేదు.. కావున తక్షణమే ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూములు ఇండ్లు కట్టి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. డబుల్ బెడ్ ఇండ్లు ఇవ్వకుండా.. ఎన్నికలకు ముందు ఓటర్లను మభ్య పెట్టటానికి గృహలక్ష్మి పథకం తీసుకువచ్చారని ఆరోపించారు. గృహలక్ష్మి పథకానికి అప్లై చేయటానికి చాలా తక్కువ సమయం ఇచ్చారు..ఇండ్లు లేని పేద ప్రజలు అందరూ అప్లై చేసుకోలేరు కాబట్టి సమయం పొడిగించాగలరని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వంత జగలో ఇండ్లు కట్టుకున్న వారికి కూడా గృహలక్ష్మి పథకం లో అప్లికేష్లను తీసుకొని వారికి కూడ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఉమ్మడి కన్నాల మాజీ సర్పంచ్ సూర సునీత, నాయకులు తలారి శంకర్శంకర్ అరుకల సతీష్, జిల్లా జాయింట్ సెక్రటరీ ఎండీ గౌసియా బేగం,మాజీ సర్పంచ్ రావుల నారాయణ, మాజీ ఉపసర్పంచ్ శంకర్ నాయక్, కొత్తపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు అమ్ముల కుమార్, యూత్ అధ్యక్షులు కొటేష్, సంపంగి సంతోష్, కట్ట భాస్కర్, కలవేన శ్రీనివాస్, శంతపురి కనకయ్య,జట్ పట్ రాజ్ కుమార్, వెంకటి,దాడి పొచమల్లూ,దరాంగుల రాజేశం, ముత్యాలు భూమయ్య, పురేళ్ళ చెందు, మడసు కృషయ్య,గొట్టే కనకయ్య, అస్టకల మధుకర్, ఒడ్డిపెళ్ళి సరెండర్,సాయికిరణ్, పిట్లా కనకయ్య శివరాత్రి శంకర్ చంద్రమౌళి తో పాటు దరఖాస్తు చేసుకునే మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.