గొర్రెల పెంపకం దారుల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు

 

 

 

 

– స్వయం ఉపాధి కల్పన ప్రభుత్వం లక్ష్యం
– కులవృత్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి
– గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి
– సీఎం కెసీఆర్ నాయకత్వంలో మార్గదర్శకంలో గొల్ల కురుమల ఆర్దికాభివృద్దికి గొర్రెల పంపిణి పథకం
– రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ జులై 8 (జనంసాక్షి): పశుసంపద అభివృద్ధితో పాటు గొర్రెల పెంపకం దారుల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతుందని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వయం ఉపాధి కల్పన ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు. సీఎం కెసీఆర్ నాయకత్వంలో మార్గదర్శకంలో గొల్ల కురుమల ఆర్దికాభివృద్దికి గొర్రెల పంపిణి పథకం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్, జక్కుల శంభయ్య, పట్టణ యువజన కమిటీ అధ్యక్షులు సోమగాని ప్రదీప్ గౌడ్, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు