గొల్ల కురుమల కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టికే గొర్రెల పంపిణీ కార్యక్రమం
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూలై 14 ::
గత ప్రభుత్వాలు చేతి వృత్తులను పట్టించుకోలేదు పట్టించుకోలేదు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలితెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్
గొల్ల కురుమల కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టికే గొర్రెల పంపిణీ కార్యక్రమం అని తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్నారు.శుక్రవారం ఆయన సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు ఆవరణంలో పట్టణానికి చెందిన 6 మంది లబ్ధిదారులకు రెండో విడత గొర్రెలు పంపిణీలో భాగంగా గొర్రెలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూగత ప్రభుత్వాలు చేతి వృత్తులను, కులవృత్తులను అస్సలు పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తులకు పెద్దపీట వేసి వారి ఆర్థిక అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. గొల్ల కురుమలు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెల ద్వారా ఎంతో ఆర్థిక పరిపుష్టి చెందుతున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను కుల వృత్తుల వారు సద్వినియం చేసుకోవాలని ఆయన సూచించారు.గొల్ల కురుమల కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం అని అన్నారు. ఈ సందర్భంగ 15 కుల వృత్తులకు లక్ష రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తున్న ప్రక్రియను గుర్తు చేశారు.ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినిగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు.ప్రభాకర్ చొరవతో గొర్రెలు రావడంపై గొర్రెల కాపరులు హర్షం వ్యక్తం చేస్తూ చింతా ప్రభాకర్ కు శాలువాతో సన్మానించి, ధన్యవాదాలు తెలిపారు. అనంతరంగొర్రెల కాపరుల సమస్యలను చింతా ప్రభాకర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ బుచ్చిరెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్ , గ్రంథాలయ చైర్మన్ నరహరి రెడ్డి , మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి రవి, వైస్ ఛైర్మన్ లతా విజయేందర్ రెడ్డి గొర్రె కాపరుల ఛైర్మన్ ప్రదీప్ కుమార్ , కౌన్సిలర్స్ ఉమా మహేశ్వరి, విష్ణు, మల్లేశం, డైరెక్టర్స్ Dr.శ్రీహరి, వెంకటేశ్వర్లు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.