గ్రంథాలయ పఠణోత్సవాన్ని విజయవంతం చేయాలి
శివ్వంపేట జూలై 11 జనంసాక్షి : ఈనెల పది నుంచి 15 వరకు జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాలు భాగంగా విద్యాశాఖ నిర్వహిస్తున్న పఠణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని దీనిని విజయవంతం చేయాల్సిన బాధ్యత హెచ్ఎంలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థుల పై ఉందన్నారు. జిల్లా విద్యాధికారి రాధాకిషన్ మంగళవారం మండల కేంద్రమైన శివ్వంపేటతో పాటుగా మండల పరిధిలోని బిజిలిపూర్ ప్రాథమికోన్నత పాఠశాల, దొంతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పఠనోత్సవం తీరును విద్యార్థులను ఆయన నేరుగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పఠణోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందనీ చెప్పారు. తద్వారా పిల్లలలో చదివే నైపుణ్యాన్ని పెంపొందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రతి పాఠశాలలో ఈ నెల 10 నుంచి 15 వ తేదీ వరకు గ్రంధాలయ వారోత్సవాలను నిర్వహించాలని ఆయన సూచించారు. అలాగే వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా 170 మంది టీచర్లను వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేశామని ఈ టీచర్లు అందరూ ఈరోజు నుంచి తమ తమ పాఠశాలల నుండి బదిలీ అయి వారికి కేటాయించబడిన పాఠశాలకు వెళ్లవలసిందిగా ఆదేశించమన్నారు. విద్యాశాఖ ఆదేశాలను ధిక్కరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఈవో హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బుచ్చా నాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.