గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మెకు టిడిపి మద్దతు
నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:
గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలను పెంచాలని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని జిల్లా కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు చేపట్టిన నిరవదిక సమ్మె 6వ రోజుకు చేరుకున్నది.మంగళవారం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధికార ప్రతినిధి రమేష్ కొప్పుల గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె చేస్తున్న శిబిరాన్ని సందర్శించి వారికి
సంఘీభావం ప్రకటించడం జరిగింది.ఈ సందర్భంగా రమేష్ కొప్పుల సమ్మెను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బందికి కనీస వేతనం 30 వేల రూపాయలు ఇవ్వాలని అలాగే వారిని శాశ్వత ఉద్యోగాలుగా గుర్తించాలని మరియు వారి సహజ మరణానికి 5 లక్షల రూపాయలు ప్రమాద మరణానికి 10 లక్షల రూపాయలు వారి కుటుంబానికి చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల చట్టాలన్నీ గ్రామపంచాయతీ సిబ్బందికి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు వీరి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కరోనా టైం లో గ్రామ పంచాయతీ సిబ్బంది వారి యొక్క ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందించారని తెలిపారు.ప్రజలను ఉదయాన్నే ఆ సూర్యుడు మేలుకొలుపుతే ఆ సూర్యున్ని మేలుకొలిపెది నగర పంచాయతీ సిబ్బంది అంటే రోజు ఉదయాన్నే నగరాన్ని పరిశుభ్రపరుస్తూ వారి కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి ప్రజల కొరకు సేవ చేస్తున్నారని అలాంటి సిబ్బంది డిమాండ్లను పరిష్కారమయ్యేంతవరకు మద్దతు తెలుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ కార్యదర్శి ఎండి జాఫర్ బాలకృష్ణ రాము శ్రీరామ్ శివ సురేష్ తదితరులు పాల్గొన్నారు.