గ్రామీణ ఆణిముత్యం ఎల్ రాజు.

పట్టుదలతో పట్టు విడవని విక్రమార్కుడిలా ఎస్సై ఉద్యోగం.
తాండూరు అగస్టు 7(జనంసాక్షి)పట్టణాలకు పల్లెటూర్లు పట్టుకొమ్మలు అనే సామెతను ఓ యువకుడు నిజం చేశారు.వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూరు గ్రామానికి చెందిన లింగమంతుల వీరమణీ నాగలింగం దంపతుల ముద్దుల తనయుడు యల్.రాజు పట్టుదలతో పట్టు విడువని విక్రమార్కుడిలా ఎస్సై పోస్టును సాధించారు.తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన ఎస్ఐ ఉద్యోగానికి అర్హత సాధించి పరీక్షకు హాజరయ్యారు. ఆదివారం ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో యల్.రాజు ఎస్ఐగా ఎంపికయ్యారు.వికారాబాద్‌ జిల్లా నుంచి మొత్తం 12 మంది ఎస్ఐ కొలువులను సాధించారు. అయితే రాజు గతంలో
ఆర్మీలో రిటైర్మెంట్ పొందిన తర్వాత ఖాళీగా ఉండి ఏమి ప్రయోజనం లేదని ఎస్ఐ కావాలనే తన కలను, తల్లిదండ్రుల కలను నిజం చేశారు.దేవనూర్ గ్రామానికి చెందిన యల్ రాజు ఎస్ఐ కొలువు సాధించి ఆదర్శంగా నిలవడం పట్ల కుటుంబ సభ్యులకు కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు దాటాయి. సంతోషంతో రాజుకు కంగ్రాట్యులేషన్స్ తెలిపారు. అదేవిందంగా గ్రామానికి చెందిన యువత, తోటి మిత్రులు, పలువురు రాజును శభాష్‌ అంటూ అభినందనలు తెలిపారు.

తాజావార్తలు