గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి : చెరుకు శ్రీనివాస్ రెడ్డి. – కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.
దౌల్తాబాద్ ఆగష్టు 1, జనం సాక్షి.
కార్మికుల సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల సమ్మె 27వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి వారికి మద్దతు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామపంచాయతి సిబ్బందికి వేతనాల పెంపు, ఉద్యోగాలను పర్మినేంట్ చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లను పంచాయతి సహాయ కార్యదర్శిలుగా నియమించాలని, గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె న్యాయమైనదని వారి సమస్యలను వెంటనే పరిష్కరించి వారిని ఆదుకోవాలని తెలిపారు. తెలంగాణ వస్తే ధర్నాలు రాస్సారోకోలు లేవని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాస్తారోకోలు,ధర్నాలు చేస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని లేనిపక్షంలో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉండి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పడాల రాములు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బండారులాలు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు దశరథ రెడ్డి,మాజీ సర్పంచ్లు ఆది వేణుగోపాల్,భద్రయ్య, నాయకులు డాకోల్ల ఆంజనేయులు గౌడ్, పడాల మల్లేశం,కుమ్మరి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.