ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

జనం సాక్షి /కొల్చారం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోరుతున్న సీఎం కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశీర్వదించాలని కొల్చారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కొరబోయిన మంజుల కాశీనాథ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల వ్యాప్తంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. వాడ వాడలా మువ్వన్నల జెండా రెపరెపలాడింది. మండల కేంద్రమైన కొల్చారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కరెంటు ఉమాదేవి రాజా గౌడ్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ కొరబోయిన మంజుల కాశినాథ్, రెవెన్యూ కార్యాలయం వద్ద తాసిల్దార్ మమ్మద్ గఫర్ మియా, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై మహమ్మద్ గౌస్, రంగంపేట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బండి సుజాత రమేష్, సొసైటీ వద్ద చైర్మన్, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, ఎనగండ్ల లో సర్పంచ్ దమ్మున్న గారి వీరారెడ్డి, ఏడిగడ్డ మాందాపూర్ లో సర్పంచ్ పేరోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి, కోనాపూర్ లో సర్పంచ్ రమేష్, పైతరలో సర్పంచ్ సంతోష ఎల్లేశం, తుక్కాపూర్ లో సర్పంచ్ మాధవి శ్రీశైలం, సంగాయిపేటలో సర్పంచు మానస శ్రీనివాస్ రెడ్డి, చిన్న గన్ పూర్ లో సర్పంచ్ ఇందిరా ప్రియదర్శిని సందీప్, కిష్టాపూర్ లో సర్పంచ్ గోదావరి వెంకట్ రాములు, రాంపూర్ లో సర్పంచ్ పట్లూరి రామ్ రెడ్డి, పోతనశెట్టిపల్లిలో సర్పంచ్ నాగరాణి నరసింహులు, అప్పాజీపల్లి లో సర్పంచ్ ఝాన్సీ లక్ష్మీ యాదగిరి, సీతారాం తండాలో శ్రీనివాస్ నాయక్, వరిగుంతంలో సర్పంచ్ ఉమారాణి శ్రీకాంత్, వెంకటాపూర్లో నెల్లికిష్టయ్య, వసురం తండాలో లంబాడి మోతి పాండు నాయక్, అంసన్పల్లిలో మన్నె శ్రీనివాస్, పోతిరెడ్డిపల్లి లో స్వర్ణ రమేష్, నైన్ జలాల్ పూర్ లో కర్రే లచ్చయ్య, కొంగోడులో మంజుల సత్యనారాయణ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో జడ్పిటిసి ముత్యం గారి మేఘమాల సంతోష్ కుమార్, ఉప సర్పంచ్ నింగోళ్ళ చెన్నయ్య, ఎంపీడీవో గంగుల గణేష్ రెడ్డి, ఏపీవో మైపాల్ రెడ్డి, ఆయా గ్రామాల్లో యువకులు, సీనియర్ సిటిజన్స్, పాఠశాలల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, యువజన సంఘాలు, కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు