చంద్రబాబుది దద్దమ్మ ప్రభుత్వం

– ముందు విూ నేతలను క్రమశిక్షణలో పెట్టుకో
– వైఫల్యాన్ని విపక్షంపైకి నెట్టడం సిగ్గుమాలిన చర్య
– జగన్‌ అధికారంలోకి వస్తేనే మహిళలకు రక్షణ వస్తుంది
– విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రోజా
విశాఖపట్నం, మే5(జ‌నం సాక్షి ) : రాష్ట్రంలో పలు చోట్ల మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని, అయినా చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని.. ఇదో దద్దమ్మ ప్రభుత్వమని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దాచేపల్లి ఘటనలో 48గంటల్లో నిందితులను పట్టుకున్నామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు.. శవాన్ని పట్టుకోవటమేనా విూ గొప్ప అని ప్రశ్నించారు. పోలీసులు కేవలం తెదేపా విూటింగ్‌లకు జనాన్ని తరలించేందుకే పనిచేస్తున్నట్లు ఉందని, ఘటన జరిగిన 48గంటలు అయినా నిందితున్ని గుర్తించడంలో పోలీస్‌శాఖ విఫలమైందన్నారు. ప్రభుత్వం  వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. అందుకే విపక్షంపై విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ‘నెల వ్యవధిలో గుంటూరులో ఎన్నో అత్యాచార ఘటనలు జరిగాయని, ఎవరినైనా చంద్రబాబు పరామర్శించారా? వైసీపీ పోరాటం చెయ్యటం వల్లే నేడు సీఎం దిగి రావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే బాధితురాలిని పరామర్శించారన్నారు. విూ తప్పును కప్పిపుచ్చుకోవడానికి బాధితులను పక్కన కూర్చోబెట్టుకున్నారని, కానీ బాధితురాలి వివరాలు చెప్పకూడదన్న నిబంధనలు కూడా తెలియదా అని ప్రశ్నించారు. పైగా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్షంపైకి నెడుతున్నారని రోజా మండిపడ్డారు. 55 ఏళ్ల వృద్ధుడ్ని పట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వం విూది. సుబ్బయ్యకు టీడీపీ సభ్యత్వం ఇచ్చిందని, స్వయంగా విూ ఎమ్మెల్యేనే అతనికి ఇంటిని కేటాయించారని అన్నారు. వీటికి ఏం సమాధానం చెబుతారని రోజా ప్రశ్నించారు. రిషితేశ్వరి కేసులో సెటిల్‌ మెంట్‌ చేశారని, కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌లో టీడీపీ నేతలు ఉండటంతో ఆ కేసును నీరుగార్చారని, గుంటూరు జడ్ఫీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌కు అన్యాయం చేశారని, ఎమ్మార్వో వనజాక్షిపై దాడి కేసులో స్వయంగా సీఎం రంగంలోకి దిగి సెటిల్‌మెంట్లు చేశారని రోజా మండిపడ్డారు. ఐపీఎస్‌ అధికారి సుబ్రహ్మణ్యంపై దాడి కేసు ఏమైంది? ఏడీఆర్‌ రిపోర్ట్‌లో ఐదుగురు టీడీపీ ప్రజా ప్రతినిధుల పేర్లు ఉన్నాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే 800 కేసులకు పైగా కొట్టేశారు. ఇంక ప్రజలకు రక్షణ ఏది?’ అని ఆమె నిలదీశారు. ఆదాయం కోసం టీడీపీ నేతలు ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా బెల్ట్‌ షాపులు పెట్టేశారని, వాటి మూలంగానే నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. వైజాగ్‌లో బికినీ షో పెడితే వైసీపీ అడ్డుకుందని, పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇప్పుడు ¬ం మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రశ్నిస్తే నాపై కొందరు టీడీపీ మహిళా నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇదేనా వాళ్ల సంస్కారం అని ప్రశ్నించారు. ముందు మహిళలను గౌరవించటం టీడీపీ నేతలు నేర్చుకోవాలని, అధికారంలోకి మద్యపాన నిషేధం అమలు చేస్తానని వైఎస్‌ జగన్‌ మొదటి నుంచి చెబుతున్నారన్నారు. ఆయన అధికారంలోకి వస్తేనే మహిళలకు రక్షణ ఉంటుందని ఎమ్మెల్యే రోజా చెప్పారు. ఇప్పటికైన ప్రబుత్వం తీరు మార్చుకోవాలని లేకుంటే ప్రజల గుణపాఠం తప్పదని
హెచ్చరించారు.

తాజావార్తలు