చంద్రబాబుపై ముప్పేటా విమర్శలతో వైకాపాకే ముప్పు
నంద్యాల ఫలితంతో మరింత ఉత్సాంగా బాబు
విజయవాడ,ఆగస్ట్29(జనంసాక్షి): మొత్తానికి ఇప్పుడు నంద్యాల ఫలితంతో సిఎం చంద్రబాబులో ఆత్మస్థయిర్యం పెరిగింది. అమరావతి విషయంలో అడుగు పడడం లేదని, ప్రత్యేక¬దా రావడం లేదని విమర్శలు చేస్తున్న వైకాపా, కాంగ్రెస్ లకు నంద్యాల ఫలితం షాకిచ్చేదిగా ఉంది.సంస్కరణలకు తానే ఆద్యుడినని చెప్పుకున్న వ్యక్తి , తాను చేపట్టిన సంస్కరణల వల్లనే ఇవాళ ఐటి పురోగమించిందని పదేపదే చెబుతున్న తరుణంలో ప్రజలు అభివృద్దిని ఆశిస్తున్నారని నంద్యాల ఫలితం రుజువు చేసింది. రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాలను దగ్గరగా చూసి, శాసించిన హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న ఓ అపర చాణక్యుడు బాబు అని మరోమారు రుజువు చేసుకున్నారు. ఇప్పుడు సమస్యలను పరిష్కరించే విషయంలో నిధుల కొరత కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న బాబుకు విబజన తరవాత ఆర్థిక పరిస్థితి కలవరపెడుతున్నా పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. రైతులకు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తు అందించడం, గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు ఉన్నా వాటిని అధిగమించే ప్రయత్నం చేశారు. ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరే కారణం లేదు..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
నిప్పులా బతికాను. ఏ తప్పూ చేయలేదు.. వైఎస్ రాజశేఖరరెడ్డి నాపై 23 కేసులు పెట్టారు. ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. ఆయనే నవ్వులపాలయ్యారు. ప్రాణం ఉన్నంత వరకు తప్పు చేయను. నేను ఎవరికైనా భయపడతానంటే అది ప్రజలకు మాత్రమే. అంటూ నంద్యాల ప్రచారంలో సైతం చెప్పుకొచ్చారు. నాకెవరూ హై కమాండ్ లేరు. ప్రజలే నా హై కమాండ్. రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగిందని పదేపదే చెప్పడం వల్ల కూడా సానుభూతి పెరిగింది. వైసీపీ లాలూచీ రాజకీయం చేస్తోందని సీఎం మండిపడ్డారు. ఆ పార్టీ నేతలకు తమ కేసుల విూద తప్ప మరే అంశంపైనా ధ్యాస లేదన్నారు. ఇలాంటి ప్రతిపక్షం ఉండడమే దురదృష్టకరమని తెలిపారు. తెలుగు జాతి గర్వపడేలా రాష్టాన్న్రి అభివృద్ధి చేస్తా. ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా శ్రమిస్తా. ప్రజల సహకారం నాకు కావాలి. కొంత మంది రాజకీయాలు చేయడానికే ప్రజల్లోకి వస్తారు. ఇలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఊర్లకు ఊర్లు ఒకటి కావాలి. రాష్టాభ్రివృద్ధికి శ్రమించే తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలి అని ప్రజలను పదేపదే కోరారు. దీంతో ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. అలా వారు నంద్యాల ఫలితం ద్వారా తమ మద్దతు బాబుకే అని నిరూపించారు.