చంద్రబాబు కన్వీనర్‌గా కమిటీ

chandrababu-naidu-pti_647_080216012602పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి అవలంబించాల్సిన పద్ధతులపై దిశానిర్ధేశం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్వీనర్‌గా 13 మందితో నీతి ఆయోగ్‌ కమిటీ ఏర్పాటైంది. ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, మధ్యప్రదేశ్‌ సిఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీ్‌సలతో పాటు నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియాలు సభ్యులుగా నియమితులయ్యారు. నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత సభ్య కార్యదర్శిగా నియమితులయ్యారు.  ప్లాస్టిక్‌ కార్డులు, యుఎ్‌సఎ్‌సడి, డిజిటల్‌ వ్యాలెట్‌లు, ఆధార్‌ అనుసంధానంతో చెల్లింపు వ్యవస్థ(ఏఇపిఎస్‌), యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫే్‌స(యుపిఐ) వ్యవస్థలపై త్వరిత గతిన ప్రజల్లో మరింత అవగాహనకల్పించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్‌ అభిప్రాయపడింది. సీఎంల కమిటీలో భాగస్వాములు కావాలని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌లను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్వయంగా కోరారు. నితీశ్‌ కుమార్‌ పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తూ పార్టీ పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తను కమిటీలో ఉండనని తేల్చిచెప్పారు. త్రిపుర ముఖ్యమంత్రికి కూడా సీపీఎం అధిష్ఠానం ఎర్రజెండా చూపింది. దీంతో వీరిద్దరి స్థానంలో ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌లకు చోటు కల్పించారు. అదనంగా ఆర్థిక రాజధాని ముంబయికి ప్రాతినిధ్యం ఇస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి సోనియాగాంధీ అనుమతి తీసుకోవాలని తెలిపారు. కమిటీలో నారాయణస్వామి పేరు చేర్చినా సమావేశాలకు ఆయన హాజరు కావడం కష్టమేనని అంటున్నారు. 

తాజావార్తలు