చంద్రయాన్ ..3 విజయవంతం కావాలి

కేరింతలు చప్పట్ల మధ్యన ఆకాంక్షించిన మంచిర్యాల జెడ్.పి బాలార పాఠశాల విద్యార్థులు.

శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంట”. షార్” లో శుక్రవారం చంద్రయాన్ 3.. బాహుబలి రాకెట్ ఎల్. వి .ఎం.3 -.ఎం.4.ను రోదసి లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి గగణ విహారం చేసిన అరుదైన ఆనంద క్షణాలను జిల్లా పరిషత్ (బాలుర) సెకండరీ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల మార్గదర్శనంలో ప్రత్యక్ష ప్రసారాన్ని ఆనందోత్సాహాల మధ్యన వీక్షించారు. పాఠశాలలో ఇటీవల “మన ఊరు.. మనబడి” కార్యక్రమంలో బాగంగా ఏర్పాటుచేసిన “ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్” ప్రత్యేక డిజిటల్ బోర్డుపై ఈ దృశ్యాలను చూసేందుకు పాఠశాలలోని పలువురు విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు.

శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవడానికి నింగి లోకి అడుగుపెట్టిన చంద్రయాన్ 3 చూడటం ఎంతగానో ఆకట్టుకుంది.

శ్రీహరికోటలో మన భారత శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన అరుదైన ఈ సన్నివేశాలను ప్రత్యక్షంగా చూస్తూ వెళ్లే ముందు విద్యార్థులు, ఉపాధ్యాయులు కేరింతల మధ్యన కర్తల ధనులు చేస్తూ విజయవంతంగా చంద్రుని చేరుకొని భారత శాస్త్రవేత్తల పరిశోధన విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల్, గుండేటి యోగేశ్వర్, ఎం.వెంకటేశ్వర్లు, బి. రాజమౌళి,స్వామి, శ్రీనివాస వర్మ, ఉదయ్,రంగ రాణి, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు