చలో డిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: సిఐటియు

విశాఖపట్టణం,నవంబర్‌6(జ‌నంసాక్షి): కేందప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఉద్యోగుల, ఫెడరేషన్ల పిలుపు మేరకు ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 11వ తేదీ వరకూ మూడు రోజుల పాటు న్యూఢిల్లీలో పార్లమెంటు వద్ద జరిగే మహాధర్నాలో కార్మికులు, ఉద్యోగులు పాల్గొనాలని సిఐటియు జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. ఉద్యోగ, కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పార్లమెంట్‌ ముందు మహాప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయన్నారు. జిఒ నెం.279ను అమలు చేయడానికి కేందప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. జిఒ నెం.151 ప్రకారం పెంచిన జీతాలను అమలుచేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులను వీధుల పాల్జేస్తూ వాటి నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలనే కేందప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి పార్లమెంటు ఎదుట నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో అన్నిరంగాల ఉద్యోగ కార్మికులు అధికసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

తాజావార్తలు