చలో హైదరాబాద్ తెలంగాణ ఉద్యమకారుల సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
రాజన్న సిరిసిల్లబ్యూరో. జులై08.(జనంసాక్షి).ఆగస్టు 20 న జరిగే ఉద్యమకారుల సదస్సును విజయవంతం చేయాలని ఉద్యమకారుల పోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ కోరారు. శనివారం సిరిసిల్లలో కార్యక్రమానికి సంబంధించిన చలో హైదరాబాద్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారుల సంక్షేమం కోసం బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. .అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ప్రకటించాలని ,ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేసి పదివేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర సంక్షేమ పథకాలలో 20 శాతం తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాలని నామినేటెడ్ పదవులలో ఉద్యమకారులకు ప్రాధాన్యత కల్పించాలని ఉద్యమకారులకు పెన్షన్ ఉచిత బస్సు ట్రైన్ పాసులను , ఇంటి స్థలాన్ని కేటాయించాలని అన్నారు. సదస్సు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పరీదుల శ్రీనివాస్ గౌడ్ ,ప్రధాన కార్యదర్శి .సురేందర్ రెడ్డి , స్టేట్ కో కన్వీనర్ నర్రా సంపత్ పెంటాచారీ కళాకారుల ఫోరం అధ్యక్షులు బత్తుల చంద్రమౌళి, కాదాసు నగేష్, . నగేష్, బత్తి చంద్రమౌళి,ఎండీ మోబిన్,తెలంగాణ శ్రీను,ఏర్రోజు ప్రభాకర్ ,కొనగొని లక్ష్మణ్ పాల్గొన్నారు.