చెన్నై దిశగా వార్ధా

delhi-chennai-cyclone-risk-high-alert-beach-in-pondicherry-news-in-hindi-116111ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా పెను తుపాను దిశ మార్చుకుంది. శనివారం వరకు మచిలీపట్నం – నెల్లూరు వైపు పయనించిన తుపాను ఆదివారం చెన్నై వైపు దిశ మార్చుకుందని వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం సాయంత్రానికి దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. తుపాను ప్రస్తుతం చెన్నైకి తూర్పున 300 కిలోమీటర్లు, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 350 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరం దాటే సమయంలో క్రమంగా బలహీన పడే అవకాశం ఉంది. పెను తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా అంతటా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో చెదురు మదురు వర్షాలతోపాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుపాను ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, అనంతపురం జిల్లాలపై ప్రభావం చూపనుంది.

తాజావార్తలు