చేపల హక్కులకు సంబంధించిన లీజు/కౌలు రఖంను మీ సేవ కేంద్రాల పోర్టల్ ద్వారా చెల్లించాలి-జిల్లా మత్స్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మప్ప.

 

నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:2023-24 (ఫస్లీ 433) నుండి ఆయా సంఘాల పరిధిలో ఉండే చెరువులు, కుంటలు మరియు రిజర్వాయర్లకు చేపల హక్కులకు సంబంధించిన లీజు/కౌలు రఖంను మీ సేవా కేంద్రాల్లో లో మత్స్య సేవా పోర్టల్ ద్వారా చెల్లించవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మప్ప బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్య శాఖ సంఘం పరిధిలో ఉండే చెరువులు, కుంటలు మరియు రిజర్వాయర్లకు సంబంధించిన కౌలు రఖంను సమీపంలో నుండే మీ సేవ సెంటర్ కు వెళ్లి మత్స్య సేవా పోర్టల్ ద్వారా మాత్రమే చెల్లించేలా గ్రామాల్లో ఉన్న మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు మరియు కార్యదర్శి లు జాగ్రత్తలు తీసుకోవాలని లక్ష్మప్ప తెలియజేశారు. మిగతా సమాచారం కొరకు మత్స్య శాఖ అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు.

తాజావార్తలు