చేర్యాల కోటి 30 లక్షలతో సిసి రోడ్లు, అండర్ డ్రైనేజ్, గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్య భవనం ప్రారంభించిన టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఆగస్టు 10 ::
కంది మండల పరిధిలోని చేర్యాల గ్రామంలో కోటి 30 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను గురువారం టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్
సీసీ రోడ్లు , అండర్ డ్రైనేజ్ ,గ్రామ పంచాయితీ భవనం , మహిళ సమైక్య భవనం ప్రారంభించారు.
చింతా ప్రభాకర్ కు గ్రామ ప్రజలు మంగళ హారతులతో , డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చింతా ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ప్రతి గ్రామంలో తన హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అన్నారు.
రానున్న ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరి ఒకసారి పట్టం కట్టాలనే అని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో CDC చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి , జెడ్పీటీసీ కొండల్ రెడ్డి,ఎంపీపీ సరళ పుల్లారెడ్డి , చేర్యాల ప్రభాకర్ ,కృష్ణ గౌడ్ ,ఖాజా ఖాన్, మోహన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రావణ్ ,వివిధ గ్రామాల సర్పంచ్ లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.