జగన్ అంటే ఎందుకు ఉలికిపాటు: వైకాపా
గుంటూరు,ఏప్రిల్21(జనంసాక్షి): వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాయాత్ర అన్నా, దీక్షలన్నా అధికార పార్టీ ఎందుకు ఉలిక్కిపడుతోందని వైకాపా జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ప్రశ్నించారు.
ప్రత్యేకర¬దాపై గతంలో ఎదురుతినిగి బాబు ఇప్పుడు దీక్ష చేయడం వల్ల సాధించేందేమిటని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూల అమలులో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన పేర్కొన్నారు. అందుకే దీక్ష అంటేనే భయపడుఉతన్నారని అన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతున్నా ఆదుకోవాల్సిన ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. మిర్చికి ధర లేదని రైతులను ఆదుకోవాలని కోరితే, మంత్రులు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పినా ఇంత వరకు అమలుకు నోచుకోలేదన్నారు. ఎన్నికల్లో ధరల స్థిరీకరణకు రూ.5 వేల కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు కేటాయించలేదన్నారు. మిర్చి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందాలంటే వ్యవసాయ శాఖ నుంచి ధ్రువపత్రం కావాలనే షరతులు పెడుతున్నారన్నారు. రైతులు నేరుగా వెళితే ఎటువంటి సహాయం అందని పరిస్థితి నెలకొందన్నారు.