జర్నలిస్టులు లేకుంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేదా..?

-ప్రత్యేక రాష్ట్రంలో జర్నలిస్టులు ఇండ్ల స్థలాలకు కోసం పోరాటం చేయడం బాధాకరం

-కరీంనగర్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చొరవ తీసుకుంటాం

-ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు, తెలంగాణ హజ్ కమిటీ                                                                                      -సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్

కరీంనగర్ ఆగస్టు 14:-తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం రోడ్లపై ధర్నా చేయడం బాధాకరంగా ఉందని, ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు, తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు గులాం అహ్మద్ పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టులు లేకుంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేది కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కరీంనగర్ ఎంపీగా, సీఎం కేసీఆర్ ఆనాడు పోటీ చేసినప్పుడు, లక్షల కోట్ల రూపాయలను ధారబోసి, నాడు సీఎం కేసీఆర్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నప్పటికి, కేసీఆర్ కు మద్దతుగా ఆనాడు జర్నలిస్టులు మద్దతుగా ఉండి గెలిపించుకున్నారని, సీఎం కేసీఆర్ పెద్ద మనసు చేసుకొని జర్నలిస్టులకు కరీంనగర్ లో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. మొన్ననే ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాదిరిగా ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించేట్లు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జర్నలిస్టుల సమస్యలను, తన ఖర్చుతో 5ప్రత్యేక బస్సులలో దారుస్సలాంకు తీసుకువెళ్లి, తమ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ద్వారా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల దృష్టికి తీసుకెళ్లి, ఇండ్ల స్థలాలను ఇప్పించే విధంగా చొరవ తీసుకుంటానని చెప్పారు.

తాజావార్తలు