జలసరికి హారతిలో పాల్గొనండి

 

ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ముందున్న టిడిపి

వచ్చే ఎన్నికల్లోనూ మాదే విజయం: లోకేశ్‌

విజయవాడ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన జలసిరికి హారతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునివ్వాలని ఏపీ మంత్రి నారాలోకేశ్‌ పిలుపునిచ్చారు. జలసంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలని అన్నారు. విజయవాడ దుర్గాఘాట్‌వద్ద విద్యాధరపురం వాటర్‌ హెడ్‌ వర్క్‌లో నిర్వహించిన జలసిరికి హారతి కార్యక్రమంలో లోకేశ్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏమూలకెళ్లినా ఎర్రరంగు గోదావరి నీళ్లే దర్శనమిస్తున్నాయని నారాలోకేశ్‌ తెలిపారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులను రికార్డుస్థాయిలో పూర్తిచేసిన ఘనత కారణంగానే ఇది సాధ్యమైందని వివరించారు.గోదావరి నీటిని కృష్ణౄకు తరలించి రైతులకు సాగునీటి కషట్‌ఆలు లేకుండా చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. ముఖ్యమంత్రి నిర్దేశిరచిన లక్ష్యానికి అనుగుణంగా వచ్చే ఎన్నికల్లో అన్నిస్థానాల్లోనూ గెలిచేందుకు కృషిచేస్తున్నామని లోకేశ్‌ అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలులు తమదేనని లోకేష్‌ తేల్చిచెప్పేశారు. వచ్చేఎన్నికల్లో తప్పకుండా టీడీపీనే గెలిచి తీరుతుందని చెప్పుకొచ్చారు. మూడురోజుల ‘జలసిరికి హారతి’ కార్యక్రమం ప్రారంభించగానే ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు వర్షాలు పడుతున్నాయన్నారు. గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసి చూపించామని మరోసారి లోకేష్‌ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఐదు లక్షల పంట కుంటలు తవ్వాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. 23 ప్రాజెక్టులు నిర్మించి రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని మంత్రి స్పష్టం చేశారు. పట్టిసీమ వద్దన్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను ప్రజలు నిలదీయాలన్నారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌, దుర్గగుడి ఈవో తోపాటు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, జలీల్‌ఖాన్‌,

ఎమ్మెల్సీలు బుద్దావెంకన్న, బచ్చుల అర్జునుడు, తదితరులు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జోరువర్షంలోనూ కృష్ణానదికి హారతి కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఇదిలావుంటే గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెంలో జలసిరికి హారతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు ప్రత్తిపాటి, నక్కా ఆనందబాబు హాజరయ్యారు. మరోవైపు ముప్పాళ్ల మండలం మాదలలో జలసిరికి హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు హాజరయ్యారు. ఎపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘జలసిరికి జల హారతి’ బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా మూడురోజుల పాటు అన్ని నీటి వనరుల వద్ద వేడుకలు నిర్వహించి హారతులిస్తారు.

తాజావార్తలు