జలసిరికి అంత ముందుకు రావాలి

చిత్తూరు,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గోదావరి జలాలను కృష్ణాకు కలిపారని.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జిల్లాకు నీరు చేరేలా చర్యలు తీసుకుంటున్నారని జడ్పీ ఛైర్‌పర్సన్‌ గీర్వాణి తెలిపారు. జిల్లాలో హంద్రీ-నీవా, గాలేరు-నగరి నీటితో జిల్లాలో సాగు, తాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీటి మనుగడ కోసం జలసిరి హారతి కార్యక్రమాన్ని చేపడుతున్నారని.. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఇదిలావుంటే ఉద్యాన పంటల సాగులో యాంత్రీకరణ పద్ధతులతో రైతులకు ఆర్థిక లబ్ది చేకూరుతోంది. ఆధునిక సాగు పద్ధతుల విస్తరణెళి లక్ష్యంగా ప్రభుత్వం రాయితీపై పలు రకాల యంత్రాలను పంపిణీ చేస్తోంది. సమగ్ర ఉద్యాన మిషన్‌ ద్వారా జిల్లాకు యాంత్రీకరణ పథకానికి నిధులు మంజూరయ్యాయి. ఈ పథకం కింద మినీ ట్రాక్టర్లు, రోటవేటర్లు, పవర్‌ టిల్లర్‌, ట్రాక్టర్‌తో నడిచే యంత్ర పరికరాలు, తైవాన్‌ స్పేయ్రర్లు, మల్చింగ్‌ లేయింగ్‌ మిషన్‌ రాయితీపై పంపిణీ చేయనున్నట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు మిని ట్రాక్టర్లను గరిష్ఠ రాయితీ రూ.లక్ష, ఇతరులకు రూ.75 వేలు రాయితీ ఉంటుందని చెప్పారు. మిగిలిన పలు రకాల యంత్రీకరణ ఉపకరణాలు ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం, మిగిలిన రైతులకు 40 శాతం రాయితీపై పొందవచ్చన్నారు. యాంత్రీకరణ ఉపకరణాలు కావాల్సిన ఉద్యాన రైతులు ఆయా మండలాల ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఉద్యాన రైతులు రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదిలావుంటే వేరుసెనగ రైతులకు పరిహారం

అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్రప్రభుత్వం సీమ జిల్లాల్లో

కరవు పరిస్థితుల నివారణకు గాను శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తాజావార్తలు