జిఎస్టీని మరింత మదింపు చేయాలి

విజయవాడ,నవంబర్‌11(జ‌నంసాక్షి): జిఎస్టీని మరింతగా మదింపు చేసి పేదసామాన్యులకు మేలు జరిగేలా చూడాలని సిఐటియు నాయకులు అన్నారు. జిఎస్టీ శ్లాబులు తగ్గించామని చెప్పడం కన్నా సహేతుకంగా మార్చాలని అన్నారు. జిఎస్టీ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్నారు. చిరు వ్యాపారులు వ్యాపారాల్లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు తీసుకున్నా అప్పుడు రూ.50 వేల కోట్లు మాఫీ చేయకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్నొన్నారు. కార్పొరేట్ల కంపెనీలకు లక్షల కోట్లు ఈ ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. ఉపాధి హావిూ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. కూలీలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో వలసలు వెళ్తున్నారన్నారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని వారు పిలుపునిచ్చారు. గత మూడేళ్ల కాలంలో పేద, బడుగు, బలహీన వర్గాలపై దాడులు, హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యంగా పేదలు, రైతుల అభ్యున్నతిని ఈ ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను ప్రజలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

తాజావార్తలు