జిపి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం పెదవిప్పాలి-టిడిపి కరాటే రమేష్ కుమార్.

 

కోటగిరి ఆగస్ట్ 7 జనంసాక్షి:-రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికులు చేపడుతున్న నిరవధిక దీక్షలు,సమ్మెలపై ప్రభుత్వం పెదవి విప్పి వారి సమస్యలను పరిష్కరించాలని బాన్సువాడ నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ కరాటే రమేష్ కుమార్ అన్నారు.శనివారం కోటగిరి మండల కేంద్రంలోనీ ఎంపిడిఓ కార్యాలయం ఎదురుగా జీపి కార్మికులు చేపట్టిన 33వ రోజు సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపి తదనంతరం మండల కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలో ఏఐటీయూసీ జిల్లా సహా కార్యదర్శి నన్నే సాబ్ ఆద్వర్యంలో 28 గ్రామాల జీపి కార్మికులు చేపట్టిన రాస్తారోకో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమ స్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. కరోనా కాలంలో ప్రతి గ్రామపంచాయతీ కార్మికులు ప్రాణలకు తెగ్గించి సేవలు చేసిన,కార్మికుల ఆరోగ్యాని కి రక్షణ కల్పించడం,వారి సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు.గ్రామా లలో జిపీ కార్మికులు చేసిన సేవలపై ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని.వెంటనే సీఎం కేసీఆర్,మంత్రి మల్లారెడ్డి జీపీ కార్మికులకు ఇచ్చిన హామీని నిల బెట్టా లని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో జిపి కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తెలుగు దేశం పార్టీ వారికి అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల జీపి కార్మికుల యూనియన్ అధ్యక్షురాలు రాజేశ్వరి,ఉపాధ్యక్షులు నాగేష్,సోషల్ మీడియా కన్వీనర్ జాకీర్ హుస్సేన్, కారోబార్లు సాయిలు,వసురం శివ,రవి,శంకర్,పోశె ట్టి,మక్కవ్వ,సావిత్రి,సునీత,సాయవ్వ,లక్ష్మీ,పంచా యతీ కార్మికులు పాల్గొన్నారు

తాజావార్తలు