జిల్లాకు మంజురైన 269 గ్రామపంచాయతీ భవనాలను గడువులోపు పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
వికారాబాద్, జూలై 15: నవ భూమి జిల్లా ప్రతినిధి
జిల్లాకు మంజూరైన 269 గ్రామపంచాయతీ భవనాలను నిర్మాణాలను నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుండి గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాల పురోగతి, పారిశుధ్యం, హరితహారం తదితర అంశాలపై అదనపు కలెక్టర్లు, డిపిఓలు, డిఆర్డిఓ లతో పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు మంజూరైన 269 గ్రామపంచాయతీ భవనాలకు 157 గ్రామపంచాయతీ పనులు వివిధ దశలో పురోగతిలో ఉన్నాయన్నారు. ఇప్పటికీ ఒక గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగిందని, ఇంకా 111 గ్రామపంచాయతీ భవన నిర్మాణాల పనులను గ్రౌండింగ్ చేయవలసి ఉందని ఆయన తెలిపారు.హరితహారం కింద మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వకం పనులు వివిధ దశలో ఉన్నాయని అదనపు కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిర్వహించి పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు వీలుగా అన్ని రకాల చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డిపిఓ తరుణ్ కుమార్, డి ఆర్ డి ఓ కృష్ణన్ లు పాల్గొన్నారు.