జిల్లాను హరిత జిల్లాగా రూపొందించాలి ఈ నెలాఖరులోగా హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలి భావితరాలకు స్వచ్ఛ వాయువులను అందిద్దాం పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి —– జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి బ్యూరో ,  జనం సాక్షి , జూలై 15  ::

జిల్లాను హరిత జిల్లాగా రూపొందించడంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పిలుపు నిచ్చారు.

శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2023-24 సంవత్సరం హరితహారం లక్ష్యాల పురోగతి పై వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్ హెచ్ ఎ ఐ, తదితర అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను హరిత జిల్లాగా చేయాలని, అందుకు ఆయా అధికారులు తమకు కేటాయించిన లక్ష్యాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు.

భావితరాలకు స్వచ్ఛ వాయువులను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సంవత్సరం జిల్లాలోని వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాలు, నాటిన మొక్కల వివరాలను ఆరా తీసారు.

టార్గెట్ మేరకు మొక్కలు నాటాలన్నారు. విద్యాశాఖకు అదనంగా లక్ష్యాన్ని కేటాయించాలని డిఆర్డిఓ కు సూచించారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో మొక్కలు నాటాలన్నారు.

ప్రతి హాస్టల్లో, ఎస్సీ ,ఎస్టీ ,బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో  వెయ్యి మొక్కల చొప్పున నాటాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత సంక్షేమ అధికారులు, ఆర్ సి ఓ లకు సూచించారు.

ప్రభుత్వ భవనాలు ఉన్న అన్ని శాఖలు వంద శాతం మొక్కలు పెట్టాలని ఆదేశించారు.

మున్సిపాలిటీల పరిధిలో అన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ , స్థలాల్లో  మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్లకు, లేఅవుట్స్ ఉన్న అన్నిచోట్ల మొక్కలు పెట్టించాలని జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారికి సూచించారు.

అన్ని గ్రామ పంచాయతీల్లోని రోడ్ల కిరువైపులా మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ కు చర్యలు చేపట్టాలని డి పి ఓ, డి ఆర్ డి ఓ కు సూచించారు. మండల స్థాయిలో ఎంపీడీవో,  ఎంపీవో, ఏపీవోలు సమన్వయంతో

ఎవెన్యూ ప్లాంటేషన్ చేయాలన్నారు.

ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, ఎన్ హెచ్ ఎ ఐ పీ.డి. రాజేష్ , మున్సిపల్ కమిషనర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆర్ సి ఓ లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్,  ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు