జిల్లాలో జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు పూర్తి ఏర్పాట్లను చేయాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 10 (జనం సాక్షి);

జిల్లా లో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పూర్తి ఏర్పాట్లు చేయాలనీ జిల్లాకలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.గురువారం నూతన ఐ డి ఓ సిసమావేశం హాలు నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అందరు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జయప్రద్రం చేయాలని కోరారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు రావలసి ఉందని అంతకంటే ముందుగా ఏర్పాట్లపై అందరు అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు. పెరేడ్ గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించనున్నామని అందుకనుగుణంగా డయాస్, బ్యారికేడింగ్ ,సీటింగ్ ఏర్పాటు తో పాటు లోపల, వెలుపలికి వెళ్లే దారిని లెవెలింగ్ చేయవలసినదిగా ఆర్ అండ్ బి అధికారికి సూచించారు. వేడుకలకు వచ్చే అతిథికి పొలిసు గౌరవ వందనంతో పాటు వేడుకలలో పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లు చూడవలసిందిగా అడిషనల్ ఎస్ పి కి సూచించారు. పట్టణమంత శుభ్రంగా ఉండేలా చూడాలని, రోడ్ల వెంట ముళ్ల పొదలను తొలగించాలని, పెరేడ్ గ్రౌండ్ లో వాటరింగ్ చేయాలని,అందరికి త్రాగు నీరు ఏర్పాటు చేయాలనీ మునిసిపల్ కమీషనర్ కు సూచించారు.పలు రంగుల పూలతో డయాస్ ను అందంగా అలంకరించాలని,విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని, ముఖ్య అతిథికి జిల్లాలో జరుగుచున్న అభివృద్ధి పనులపై ప్రసంగం రూపొందించవలసినదిగా కోరారు.పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయవలసినదిగా సూచించారు. ప్రోటోకాల్ ప్రకారం అతిధులను ఆహ్వానించాలని,ఇన్విటేషన్ కార్డు రూపొందించాలని, ఓవరాల్ గా అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన పనులను పూర్తి చేసేలా,వేడుకలు విజయవంతంగా నిర్వహించేలా పర్యవేక్షించవలసినదిగా ఆర్.డి.ఓ. చంద్రకళ కు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులచే దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు ఐదు కు మించకుండా చేసి సిద్ధంగా ఉంచుకోవలసినదిగా కోరారు.
అనంతరం ప్రభుత్వం ఆదేశాల మేరకు వి ఆర్ ఎ లను రెగ్యులరైజ్ చేయడం జరిగిందని,శాఖలలో ఉన్న ఖాళీల ప్రకారం వివిధ శాఖలకు నియమించడం చేస్తున్నామన్నారు. ఆఫీస్ సబోర్దినేట్ ,రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, వాచేమేన్,క్యాటగిరి వారిగా అల్లోట్ చేయడం జరిగిందని అన్నారు.శుక్రవారం మద్యాహ్నం 2.30 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి చేతుల మీదుగా కె ఎస్ ఫంక్షన్ హాల్ నందు ఆర్డర్ కాపీ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.మండలం వారిగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.వారి విద్యా అర్హత,మండలం అన్ని చూసుకొని ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్ పి ఎన్.రవి,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు