జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే ప్రధాన లక్ష్యం.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి…
.. జిల్లా ఎస్పీ రమణ కుమార్

జనం సాక్షి సంగారెడ్డి టౌన్

జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ రమణ కుమార్ కోరారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పి రమణ కుమార్ అదనపు కలెక్టర్ మాధురి తో కలిసి వివిధ శాఖలకు చెందిన అధికారులతో NCORD కో-ఆర్డినేషన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ యం.రమణ కుమార్ మాట్లాడుతూ నార్కోటిక్ అనేది దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యని,అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో గంజాయి, ఒ.పి.యం. వంటి మాదకద్రవ్యాల వినియోగాన్ని, రవాణాను అరికట్టాలని సూచించారు.

గంజాయి సాగు నిర్మూలనకు గ్రామస్థాయి అధికారి నుండి ఉన్నత స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ఒక గ్రామంలో గంజాయి సాగు చేస్తున్నారంటే ఆ గ్రామ అధికారులందరు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.

అటవీ శాఖ వారు తమ పరిధిలో ఎక్కడైనా గంజాయి సాగుచేస్తున్నారా, సారాయి కాస్తున్నారా అన్నది గుర్తించాలన్నారు. విధ్యుత్ శాఖ అధికారులు రైతులు ఎవరైన కరెంటును గంజాయి సాగు కోసం వాడుతున్నది గుర్తించాలన్నారు. రైతులు గంజాయి సాగు చేసినట్లయితే వారి భూమిని సీజ్ చేసి ప్రభుత్వానికి అప్పగించడంతో పాటు వారికి ప్రభుత్వం నుండి రావలసిన అన్ని సంక్షేమ పథకాలు నిలిపివేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మెడికల్ షాప్ లలో ప్రభుత్వ ఆమోదం ఉన్న డ్రగ్ అమ్ముతున్నది, ప్రభుత్వ నిషేదిత, అనుమతులు లేని డ్రగ్స్ అమ్ముతున్నది పరిశీలించాలని తెలిపారు.
అనుమతులు లేని, నిషేదిత డ్రగ్స్ అమ్మిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకో
వాలన్నారు.

విధ్యాశాఖ స్కూల్స్, కళాశాలల పరిసర ప్రాంతాలలో వివిధ రూపాలలో డ్రగ్స్ వంటివి అమ్ముతున్నారా, విధ్యార్థులెవరైనా మాదకద్రవ్యాలకు బానిసలౌవుతున్నారా అన్న విషయాలపై ఎప్పటికప్పుడు పరిశీలించి, అలాంటి వారెవరైన ఉన్నట్లైతే పోలీసు శాఖకు సమాచారం అందిచాలన్నారు.

జిల్లాలో పోలీసు శాఖ గడిచిన రెండు సంవత్సరాలలో 4124.4 కిలోల ఎండు గంజాయి సీజ్ చేయడంతో పాటు, 1450 గంజాయి మొక్కలను ద్వంసం చేసారని తెలిపారు.

మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసు శాఖ ఎల్లవేలల అన్ని శాఖలకు పూర్తి సహకారం అందిస్తుందన్నారు.

ఈ సమావేశంలో అధినపు కలెక్టర్ మాధురి, జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ గాయత్రి డి.ఆర్.ఒ.నగేష్,
డి.యం& హెచ్.ఒ,
గాయత్రి దేవి, ఇన్చార్జి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రసాద్,యఫ్.ఆర్.ఒ.చంద్రశేఖర్ , జెడ్పి సీఈవోఎల్లయ్య, సంగారెడ్డి జోన్ డ్రగ్ ఇన్స్పెక్టర్
రవికిరణ్ రెడ్డి ,జి.యస్.టి
అసిస్టెంట్ కమిషనర్ జానయ్య, సెక్టోరల్ ఆఫీసర్ వెంకటేశం ,సంగారెడ్డి డిఎస్పి రమేష్ కుమార్, జహీరాబాద్ డిఎస్పీ రఘు, పటాన్ చెరు డిఎస్పి పురుషోత్తం
నారాయణఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి, డి.సి.ఆర్.బి.ఇన్స్పెక్టర్లు
రమేష్ ,కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు