జిల్లా కేంద్రంలో భక్తి శ్రద్ధలతో దుర్గా మాత నవరాత్రి ఉత్సవాలు.

బాల త్రిపుర సుందరీ దేవిగా వాసవి మాత దర్శనం.
సాయిభాలాజీ సిండికేట్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27(జనంసాక్షి):
దుర్గా మాత నవరాత్రి ఉత్సవాలు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపు కుంటున్నారు.పట్టణంలోని వివిధ కాలనీల లో ప్రతీష్ట చేసిన అమ్మవారికి రోజుకొక అలంకరణతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో సాయి బాలాజీ సిండికేట్ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్ట చేయడం జరిగింది. కొల్లాపూర్ చౌరస్తాలో గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం, రాంనగర్ కాలనీలో శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో, హౌసింగ్ బోర్డ్ లో అయోధ్య యూత్ ఆధ్వర్యంలో మరియు మైల్ స్టోన్ యూత్ ఆధ్వర్యంలో దుర్గ మాతను ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో సాయి బాలాజీ సిండికేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 52వ దేవీ నవరాత్రి ఉత్స వాలలో భాగంగా మంగళవారం వాసవి మాతను శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాచిపెద్ది రాజ్యలక్ష్మి శ్రీనివాసులు కొండూరు ఉమారాణి సాయిరాం చిగుళ్లపల్లి జ్యోతి రమణ కుమార్ మిడిదొడ్డి బాలమణి రామ్ గోపాల్ అర్థం రోజా రాణి జయ శేఖర్ దంపతులు అలంకరించగా ఆలయ ప్రధాన అర్చకులు జోషి పాండురంగ శర్మ ఆధ్వర్యంలో ఉత్సవాలలో ప్రత్యేక పూజలు నిర్వహించా రు.విశేష అభిషేక కంకర్యం పూజా కార్యక్రమంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి సబితా మహిదర్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.పూజా కార్యక్రమాల అనంతరం ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాచిపెద్ది శివకుమార్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ వారిని ఘనంగా సన్మానించారు అనంతరం సామూహిక పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు హాకీం రాజేష్. మిడిదొడ్డి చంద్రశేఖర్ రాధాకృష్ణ వెంకటరమణ బాదం రమేష్ శ్రీనివాసులు యాదయ్య అల్లంపల్లి రమేష్ బాదం పరమేష్ కందూరు బాలరాజు పూలరాజు నామ రాము కండే సాయి శంకర్ పూల రాము తదితరులు పాల్గొన్నారు.