జీవనోపాధి కల్పించడంలో ప్రభుత్వాల వైపల్యం

నిరుద్యోగం పెరుగుతున్నా కానరాని కార్యాచరణ
న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): కరోనా థర్డ్‌వేవ్‌..డెల్టా వేరియంట్‌ అంటూ వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోమారు గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో మరోమారు కరోనా విజృంభించకుండా ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పదేపదే హెచ్చరిస్తోంది. అయితే ఇప్పటికే బజారున పడ్డ సామాన్యులు తమ జీవనోపాధి కోసం రోడ్డెక్కి అడ్డమైన పనులు చేయడానికి కూడా వెనకాడడం లేదు. అటు ఆర్థిక సంక్షోభం, మరోవైపున కరోనా విపత్తు మూలంగా దేశంలో ఉపాధి అవకాశాలు క్షీణిస్తున్నా పాలకులు ఉద్యోగ,ఉపాధి రంగాలపై ఇంకా దృష్టి సారించడం లేదు. కేంద్ర ప్రభుత్వ గణాంక శాఖ విడుదల చేసిన నియమిత కాల శ్రామిక శక్తి సర్వే అంటే పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే` పిఎల్‌ఎఫ్‌ఎస్‌ ఉద్యోగ నియామకాలపై నిగ్గు తేల్చి చెప్పింది. 2017 ఏప్రిల్‌ నుండి ప్రతి మూడు నెలలకోసారి పిఎల్‌ఎఫ్‌ఎస్‌ నిర్వహించి నివేదిక విడుదల చేస్తున్నారు. కరోనా మొదటి దశలో ముఖ్యంగా 2020 మార్చి 28 నుండి అమలు చేసిన 68 రోజుల
లాక్‌డౌన్‌ సమయంలో నిరుద్యోగ భూతం ఎంతలా దేశాన్ని ఆవరించిందో నివేదిక తేటతెల్లం చేసింది. 2019 ఏప్రిల్‌ జూన్‌ మధ్య 8.9 శాతంగా ఉన్న పట్టణ ప్రాంత నిరుద్యోగిత 2020 అదే కాలంలో 20.9 శాతానికి పెరిగింది. 2019 జులై నుండి 2020 జూన్‌ వరకు ఏడాది వివరాలు చూస్తే దేశవ్యాప్త నిరుద్యోగిత రేటు 5.8 శాతం నుండి 4.8 శాతానికి తగ్గినట్టు గణాంకాలు పేర్కొనన్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉపాధి ఎంతలా క్షీణించిందో చివరి తైమ్రాసిక వివరాలు తేటతెల్లం చేశాయి. అధిక ఆదాయ అవకాశాలున్న పట్టణ ఉపాధి పోయి, తక్కువ ప్రతిఫలం దక్కే గ్రావిూణ ఉపాధి కొద్దిగా ఎక్కువ లభించినా ప్రయోజనం ఉండదు. అంటే రెట్టింపయింది. ఇటీవల విడుదల చేసిన నివేదిక వెల్లడిరచిన గ్రావిూణ ఉపాధి వివరాలు పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత మరింత స్పష్టమవుతుంది. పైన పేర్కొన్న మూడు నెలల కాలంలో ఒక కోటి 10 లక్షల మంది పట్టణవాసులు ఉపాధి కోల్పోగా గ్రావిూణ ప్రాంతాల్లో ఒక కోటి 14 లక్షల మంది కొత్తగా ఉపాధి పొందారు. వ్యవసాయ రంగంలో ఉపాధి లభించిన రోజుల సంఖ్య పెరిగినట్టు కనిపించినా పని గంటలు తగ్గిపోవడం, సగటు వేతనం దిగజారడం గురించి కూడా నివేదిక పేర్కొంది. మొత్తంగా చూస్తే అన్ని వైపుల నుండి తీవ్ర ఒత్తిడికి గురయ్యిందన్నది వాస్తవం. గ్రావిూణ ఉపాధి హావిూ పనుల్లో వేతనాలు కూడా ఈ కాలంలో ఘోరంగా తగ్గిపోయాయి.ప్రజల ఆదాయాలు తీవ్రంగా తగ్గిపోయిన నేపథ్యంలో మాంద్యం నెలకొనడం, పర్యవసానంగా శ్రామికులకు మరింతగా ఉపాధి తగ్గిపోవడం జరుగుతోంది. కనుక ఉపాధి అవకాశాలను పెంచడం ప్రధాన లక్ష్యం కావాలి. మాంద్యం వల్ల పారిశ్రామికోత్పత్తుల నిల్వలు పేరుకుపోయాయి. ఈ సంక్షోభం నుండి బయట పడడానికి ప్రజల కొనుగోలు శక్తి పెంచడం తక్షణ మార్గమని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. అందుకు తగిన విధంగా సహాయ ప్యాకేజిని ప్రభుత్వం ఇవ్వాలి. కాని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఏవిూ చెయ్యకుండా ఆత్మ నిర్భర్‌ ప్యాకేజి పేరిట ప్రకనటు చేసతున్నా ప్రయోజనం కానరావడం లేదు. అలాగే ముందుగా అందరికీ వ్యాక్సినేషన్‌ జరగాలి. తద్వారా కరోనా మహమ్మారిని కట్టడి చేయడమూ సాధ్యమవుతుంది. కాని కేంద్ర ప్రభుత్వం టీకా సరఫరాలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికైనా దేశీయ టీకా ఉత్పత్తి సామర్ధ్య పెంపుదలకు చర్యలు చేపట్టి ఈలోగా అవసరమైన మేరకు విదేశాలనుండి దిగుమతి చేసుకోవాలి. వయోజనులందరికీ సార్వత్రిక ఉచిత టీకా అందజేయాలి.

తాజావార్తలు