42% బీసీ రిజర్వేషన్ల సాధనకు.. నేడు హస్తినలో మహాధర్నా..
` ఢల్లీి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్,మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు
` ధర్నాకు సంఫీుభావం తెలపనున్న రాహుల్ గాంధీ
ఢల్లీి(జనంసాక్షి): బీసీ రిజర్వేషన్ల పోరాటం దేశ రాజధాని ఢల్లీి చేరుకుంది. రాహుల్ గాంధీ నినాదాన్ని ఆచరణలో పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పట్టువీడకుండా ప్రయత్నిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు- విద్యా, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జంతర్‌మంతర్‌లో బుధవారం ధర్నా చేపట్టనున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో సాగుతున్న సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కుల గణన చేపడతామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవెర్చే బాధ్యతను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తన భుజాలకు ఎత్తుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చేపట్టి.. ఆ లెక్కల ఆధారంగా రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. వాటికి ఆమోదముద్ర వేయించాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఉంది… రాష్ట్ర శాసనసభలో బీసీ రిజర్వేషన్ల బిల్లులకు మద్దతు పలికిన బీజేపీ నాయకులు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా ముస్లింలను సాకుగా చూపి భావోద్వేగ రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జంతర్‌మంతర్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు… బీసీ సంఘాల నాయకులు పాల్గొననున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, వివిధ జిల్లాల నాయకులు ప్రత్యేక రైలులో ఢల్లీి చేరుకున్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు సంబంధించి జంతర్‌మంతర్‌తో పాటు ఢల్లీిలోని తెలంగాణ భవన్ ఎదుట పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ధర్నాకు రాహుల్ గాంధీ
బీసీ రిజర్వేషన్ల సాధనకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగే పోరుకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, వామపక్షాలు, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) తదితర పార్టీల నాయకులు హాజరై తమ సంఫీుభావం తెలపనున్నారు.
బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఆందోళన
` గురువారం రాష్ట్రపతిని కలసి వినతిపత్రం సమర్పణ
న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం ఆందోళన చేపట్టారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే లోక్‌సభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు ఢల్లీికి భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే ఢల్లీికి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ కీలక నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా విూడియాతో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడారు. చిత్తశుద్ధి ఉంటే కేందప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవద్దని సూచించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపారని డిమాండ్ చేశారు. ఇప్పటికే ముసాయిదాని రాష్ట్రపతికి పంపించామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. 42శాతం బీసీ రిజర్వేషన్లకు కేందప్రభుత్వం ఆమోదం తెలపాలని మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. 50శాతం పరిమితిని ఎత్తివేయాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు కార్యచరణ రూపొందించారని చెప్పుకొచ్చారు. బుధవారం జంతర్ మంతర్ వద్ద దాదాపు 20,000 వేల మందితో ఆందోళన నిర్వహిస్తున్నామని వెల్లడిరచారు. బీసీ రిజర్వేషన్ పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉందని ఉద్ఘాటించారు. మైనార్టీలను అడ్డుగా చూపుతూ బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకోవడం సరికాదని మంత్రి వాకిటి శ్రీహరి హితవు పలికారు. బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు సపోర్టు చేశారని.. ఢల్లీిలో ఎందుకు మిన్నకుండిపోయారని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో కాకుండా ఢల్లీిలో ధర్నా చేయాలని సూచించారు. అసలు బీసీ రిజర్వేషన్ విషయంలో కవితకు ఏం సంబంధమని నిలదీశారు. కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని విమర్శించారు. పార్లమెంట్‌లో ఎంపీల వాయిదా తీర్మానాలు, ధర్నా, గురువారం రాష్ట్రపతిని కలుస్తామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.