బంజారాహిల్స్ లో భారీ గుంత

హైదరాబాద్ (జనంసాక్షి) : బంజారాహిల్స్‌లో భారీ వర్షాల కారణంగా రోడ్డు కుంగిపోవడంతో, ఆ గుంతలో వాటర్ ట్యాంక్ పడిపోయింది. రోడ్ నంబర్ 1లోని మహేశ్వరీ టవర్స్ ముందు మంగళవారం ఉదయం రోడ్డులో కొంతభాగం కుంగిపోయింది. దీంతో భారీ గుంత ఏర్పడగా అందులో అటుగా వస్తున్న నీటి ట్యాంకర్‌ అందులో పడిపోయింది. ఈ ఘటనలో ట్యాంకర్‌ డ్రైవర్‌తోపాటు క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగానే ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. నాలాపై ఈ రోడ్డు నిర్మించారని స్థానికులు చెబుతున్నారు.