శిబూసోరెన్‌ కన్నుమూత

` ఢల్లీిలో గంగారాం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన రaార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి
` సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని
న్యూఢల్లీి(జనంసాక్షి): రaార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్‌ (81) కన్నుమూశారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ దిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు.ఈ విషయాన్ని ఆయన కుమారుడు, రaారండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడిరచారు. ‘’మన ప్రియనేత దిషోమ్‌ గురూజీ మనల్ని విడిచివెళ్లిపోయారు. నాకు సర్వం కోల్పోయినట్టుగా ఉంది’’ అని ఉద్వేగపూరితంగా రాసుకొచ్చారు.ప్రస్తుతం బిహార్‌లో భాగమైన రామ్‌గఢ్‌ జిల్లాలో శిబూసోరెన్‌ జన్మించారు. ఆయన సతీమణి పేరు రూపీ సోరెన్‌. ఆయనకు నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు హేమంత్‌, బసంత్‌, దుర్గా సోరెన్‌. కుమార్తె పేరు అంజలి. 2009లో దుర్గా సోరెన్‌ మృతి చెందారు. బసంత్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సంతాల్‌ కమ్యూనిటీకి చెందిన శిబు సోరెన్‌… వామపక్ష నేత ఏకే రాయ్‌, కుర్మి మహతో బినోద్‌ బిహారీ మహతోతో కలిసి 1972లో రaార?ండ్‌ ముక్తి మోర్చాను ఏర్పాటు చేశారు. తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో కీలక నేతగా ఎదిగారు. ఆ పోరాట ఫలితంగా 2000లో రaారండ్‌ రాష్ట్రంగా ఏర్పడిరది. 2005లో ఆయన తొలిసారి సీఎం అయ్యారు.ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. ఒక్కసారి కూడా పూర్తికాలం పదవిని నిర్వహించలేకపోయారు. 2004లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా.. అక్కడా అదే పరిస్థితి. 1974 నాటి కేసు కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. తన మాజీ కార్యదర్శి హత్య కేసులో దోషిగా తేలడంతో మరోసారి కేంద్రమంత్రి పదవిని కోల్పోయారు. ఒక హత్యకేసులో కేంద్రమంత్రి దోషిగా తేలడం అదే తొలిసారి. అయితే దిల్లీ హైకోర్టు తర్వాత ఆయన్ను నిర్దోషిగా తేల్చింది. శిబూ సోరెన్‌కు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఆయన ఎనిమిది సార్లు లోక్‌సభ, రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.ఆయన మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. ‘’శిబూసోరెన్‌జీ అట్టడుగు స్థాయి నుంచి ప్రజాజీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగారు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. గిరిజనులు, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడం కోసం కృషి చేశారు. ఆయన మరణం బాధాకరం. ఇప్పుడు ఆయన కుటుంబం, అభిమానుల గురించే నా ఆలోచనంతా. ఇప్పటికే హేమంత్‌ సోరెన్‌జీతో మాట్లాడాను. ఓం శాంతి’’ అని మోదీ ఎక్స్‌ వేదికగా వెల్లడిరచారు.
ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలకు,ఫెడరల్‌ స్ఫూర్తికి లోటు: కెసిఆర్‌
జార్ఖండ్‌ ముక్తి మోర్చా అధినేత, జార్ఖండ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్‌ మృతి పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆయన మరణం జార్ఖండ్‌, తెలంగాణ వంటి దేశ ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలకు, జాతీయ ఫెడరల్‌ స్ఫూర్తికి, ఆదివాసీ సమాజానికి తీరని లోటని అన్నారు. ఈ సందర్భంగా శిబూ సోరెన్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి వారందించిన సహకారాన్ని స్మరించుకున్నారు. దేశ ఫెడరల్‌ స్ఫూర్తిని ప్రతిఫలించే దిశగా, శిబూ సోరెన్‌ చేపట్టిన జార్ఖండ్‌ స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తి నింపిందన్నారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన సమయంలో శిబూ సోరెన్‌ని హైదరాబాద్‌లో జరిగిన తొలి సభకు మొదటి అతిథిగా ఆహ్వానించుకున్నామని గుర్తు చేశారు. నాటి తెలంగాణ ఉద్యమానికి ఆయన తెలిపిన సంపూర్ణ సంఫీుభావం మర్చిపోలేనిదని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించిన శిబూ సోరెన్‌, తాను ప్రారంభించిన తెలంగాణ మలిదశ ఉద్యమానికి అండగా నిలిచారని కేసీఆర్‌ తన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు- సమయంలో కూడా శిబూ సోరెన్‌ మద్దతుగా నిలిచారని, జార్ఖండ్‌, తెలంగాణ ప్రజల ఉద్యమ విజయాలు దేశ ఫెడరల్‌ స్ఫూర్తికి, ప్రాంతీయ, సామాజిక న్యాయానికి దిక్సూచిగా నిలిచాయని కేసీఆర్‌ తెలిపారు. శిబూ సోరెన్‌ నేతృత్వంలోని జేఎంఎం పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడంతో రాష్ట్ర ఏర్పాటు- కోసం ఒత్తిడి తేవడంలో కీలక పాత్ర పోషించిందని వెల్లడిరచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు- అనంతర కాలంలో 2022లో జార్ఖండ్‌లో శిబూ సోరెన్‌ని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్న విషయాన్ని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తండ్రిని కోల్పోయి దుఃఖ సంద్రంలో మునిగిన వారి కుమారుడు జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్‌ మృతిపట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనకు తీవ్ర బాధను కలిగించింద న్నారు. శిబు సోరెన్‌ మరణం కేవలం వ్యక్తిగతంగానే కాకుండా.. న్యాయం, గుర్తింపు, అచంచలమైన నిబద్ధత కలిగిన శకానికి ముగింపు. గిరిజన హక్కులు, ప్రాంతీయ స్వయం నిర్ణయాధికారానికి పోరాడిన యోధుడు సోరెన్‌ అని చెప్పారు. తెలంగాణ ఉద్యమ గందరగోళ పరిస్థితుల్లో సోరెన్‌ తమకు అండగా నిలిచారని చెప్పారు. కీలకమైన దశలో తమ ఆందోళనలకు సంఫీుభావం తెలపడం మాకు అదనపు బలాన్ని ఇచ్చిందన్నారు. సోరెన్‌ దార్శనికత, విలువలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని, ఆయన కుటుంబ సభ్యులకు ఎక్స్‌ వేదికగా ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ’భారత రాజకీయాల్లో ఒక మహోన్నత వ్యక్తి, గిరిజన హక్కులు, ప్రాంతీయ స్వయం నిర్ణయాధికారం కోసం అవిశ్రాంత పోరాట యోధుడు, జార్ఖండ్‌ మాజీ
ముఖ్యమంత్రి శిబు సోరెన్‌ మరణం నాకు తీవ్ర బాధను కలిగించింది. ఆయన మరణం కేవలం వ్యక్తిగత నష్టం కాదు. ఇది న్యాయం, గుర్తింపు, గౌరవం పట్ల అచంచలమైన నిబద్ధతతో ఏర్పడిన ఒక శకానికి ముగింపును సూచిస్తుంది. తెలంగాణ ఉద్యమ గందోరగోళ పరిస్థితుల్లో అరుదైన దృఢ నిశ్చయంతో మాకు తోడుగా నిలిచారు. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌తో ఆయన సంఫీుభావం, తెలంగాణ ఆందోళనకు నైతిక ప్రోత్సాహం కీలకమైన సమయంలో మాకు బలాన్ని ఇచ్చాయి. జార్ఖండ్‌ కోసం ఇదే మార్గంలో నడిచినందున ఆయన తెలంగాణ ఆత్మను అర్థం చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు, బీఆర్‌ఎస్‌ కుటుంబం తరపున హేమంత్‌ సోరెన్‌, వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. శిబు దార్శనికత, విలువలు మన సమిష్టి మనస్సాక్షిలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.