బంజారాహిల్స్‌లో డ్రైనేజీపై కుంగిన రోడ్డు
` హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం
హైదరాబాద్,ఆగస్టు 5(జనంసాక్షి):హైదరాబాద్ నగరంలో పలు చోట్ల మరోమారు భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్ లో రోడ్డు కుంగింది. అకస్మాత్తుగా రోడ్డు కుంగడంతో అటుగా వస్తున్న నీటి ట్యాంకర్ అందులో పడిపోయింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్‌తోపాటు- క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. వారిని సవిూప ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షం కారణంగానే రోడ్డు కుంగినట్లు అధికారులు చెబుతున్నారు. కుంగిన చోట రోడ్డు కింద నాలా పైప్‌లైన్ ఉన్నట్లు- గుర్తించారు. రహదారి కుంగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిరది. వాహనాన్ని తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. సోమవారం కురిసిన భారీ వర్షానికి కూకట్‌పల్లి జాతీయ రహదారిపై ముస్లిం గ్రేవ్ యార్డ్ వద్ద ఉన్న మ్యాన్‌హోల్‌తో పాటు రోడ్డు కుంగింది. దీంతో రహదారిపై రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. అదే రహదారిపై ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. ఫలితంగా స్టేషన్ నుంచి వై జంక్షన్ వరకు మురుగు నీరు ప్రవహిస్తోంది.