జులై12 న విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి -ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి కిరణ్
మహబూబాబాద్ బ్యూరో-జులై9(జనంసాక్షి)
భారత విద్యార్థి ఫెడరేషన్ మానుకోట జిల్లా కమిటీ సమావేశం స్థానిక పెరుమాళ్ళ జగన్నాథ్ భవన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పట్ల మధు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామర కిరణ్ మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడుస్తున్న విద్యారంగం అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల దగ్గర కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం లక్షల ఫీజులు వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుందని, జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీలు కల్పించడంలో పాఠశాలలు నిరకరిస్తున్నా అధికారులకు పట్టనట్టే ఉందని, ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని అన్నరు. పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేసి కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలని, సంక్షేమ ఆస్తుల సమస్యలు పరిష్కారం కోసం, గురుకులాలకు సొంత భవనాలు కేటాయించాలని విద్యారంగా సమస్యలు పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారని, మేధావులు విద్యావంతులు, విద్యార్థులు సహకరించి విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కేలోత్ సాయికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు పెద్దబోయిన వీరబాబు, సహాయ కార్యదర్శులు. గుగులోత్ సూర్య ప్రకాష్, గంధసిరి జ్యోతిబాస్, బానోత్ సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.