జెండా పండుగకు అయిన పోవచ్చా?
దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజికవేత్తలు మీడియా ,ప్రజలందరూ కలిసి జెండా పండుగ సంబరాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భిన్నమైన వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయులు ,రాజకీయ నాయకులు, మీడియా, విద్యార్థి సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అ యోమయంలో ఉండడం బాధాకరము కలిగించే అంశంగా ఉంది. ఎందుకంటే గత నెలలో పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన గారు జారీచేసిన ఆదేశాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చదువుకున్న పాఠశాలకు స్థానికంగా ఉన్న పాఠశాలకు తన ముందు సమస్యలతో ఉన్న పాఠశాలకు పోయే స్వేచ్ఛ లేకుండా ఆదేశాలను ఇవ్వడం అనుమతి తీసుకొని పోయేలా ఉండాలని చెప్పడం విడ్డూరంగా ఉంది. దేశంలో ఇలాంటి సర్కులర్ జారీచేసిన రాష్ట్రం మొదట తెలంగాణ ప్రభుత్వమై ఉంటుంది ముఖ్యంగా నిత్యం అనేక విషయాలను ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి అనేక మందికి సమాచారం చేరవేసీ సమాజాన్ని చైతన్యపరిచే మీడియాకు అలాగే విద్యారంగా అభివృద్ధి కోసం సమస్యల పరిష్కారం కోసం సమాజాభివృద్ధి కోసం పాటుపడే విద్యార్థి సంఘాలకు అనుమతి లేదనడం సమాజ సేవ చేయడం దైవంగా భావించే స్వచ్ఛంద సంస్థలకు కూడా అనుమతి లేదనడం దురదృష్టకరం కాదా? అనేది మనం గమనించాల్సిన విషయం కనీసం ప్రభుత్వానికి రాజ్యాంగం అంటే గౌరవం ఉందా అనేది మనందరం ప్రశ్నించాల్సిన ప్రశ్న. ఆదేశాలు జారీ చేస్తున్న తరుణంలో రాజకీయ అవసరాలకు ఇస్తున్నారా సమాజాభివృద్ధి కోసం ఇస్తున్నారన కనీస జ్ఞానం లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటుగా భావించాలి. ఏ సమాజంలో ఏ నిర్ణయం చేయాలో తెలియని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉండడం మన దురదృష్టంగా భావించాలి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నందుకు బాధపడాలో సిగ్గుపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్టుగా మనం భావించాలి ప్రత్యేక ఉద్యమంలో అనేక ఉద్యమాలు జరుగుతున్నప్పుడు సకలజనుల సమ్మె జరుగుతున్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి ప్రభుత్వం అనేక ఆదేశాలు జారీ చేసినప్పుడు ఇదే ప్రస్తుతం ప్రభుత్వంలో కొనసాగుతున్న మంత్రులు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు మరిచి నేడు ఎవరికి అనుమతి లేకుండా రానివ్వద్దని జారీ చేయడం దేనికి సూచిక అనేది వారు పునరాలోచించుకోవాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి అమరులైన అమరుల స్ఫూర్తి అని మాట్లాడుతున్న కేసీఆర్ గారు నేడు అమరులు చదువుకున్న పాఠశాలకు కూడా పోకుండా ఉండే దుస్థితికి తీసుకొచ్చిందంటే విరు అమరులను గుర్తించినట్టా అనేది నెమరు వేసుకోవాలి అమరులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని పునరాలోచించుకోవాలి.
ఆదేశాలిస్తే మరి కేటీఆర్ గారి మాటలు ఎలా నిజమవుతాయి!
గత సంవత్సరం అంటే 12-02- 2023 లో ప్రభుత్వ పాఠశాల లో మౌలిక వసతుల కల్పనే దేయంగా రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మనబడి కార్యక్రమంలో స్వయంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను భాగస్వాములను చేసి అలాగే విదేశాల స్థిరపడిన తెలంగాణ ప్రవాసుల సహాయాన్ని కూడా కోరుకుంటున్నామన్నారు ముఖ్యంగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కోటి రూపాయలు మరియు అంతకంటే ఎక్కువ మొత్తాన్ని విరాళంగా ఎవరిచ్చిన వారు చెప్పిన పేరు పాఠశాలకు పెడతామన్నారు అలాగే 10 లక్షలు లేదా అంతకుమించి ఇస్తే తరగతి గదికి పేరు పెడతామన్నారు ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి గారు అదే సమావేశాల్లో మాట్లాడుతూ ఈ కార్యక్రమం పై పూర్తి విశ్వాసం ఉందని అన్నారు అలాగే ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునే వారికి ప్రభుత్వం పూర్తి సహకారం ఇస్తామన్నారు సంతోషం. కానీ ప్రశ్న ఏంటంటే ప్రతి సమస్యను అందరికీ తెలియజేసే మీడియాను విద్యార్థి సంఘాలను స్థానిక ప్రజాప్రతినిధులను రాజకీయ నాయకులను లోపలికి రానివ్వకుండా ఇందులో సమస్యలు తెలవకుండా దత్తత ఎవరు తీసుకుంటురు అనేది ప్రశ్న వారు చదువుకున్న పాఠశాలకు వారి స్థానికంగా ఉన్న పాఠశాలకు సమస్యలు పరిష్కరించడం కోసం అనుమతులు తీసుకోవాలా అనేది కూడా ప్రశ్నించాలి కాబట్టి ప్రభుత్వం ఆదేశాలను పక్కకు పెట్టకుండా కేవలం కేటీఆర్ గారు మీటింగ్లు పెట్టుకొని ప్రకటించడం అనేది కల్లగా మిగిలిపోతుందనేది ప్రభుత్వం గమనించాలి నిత్యమేదో సమస్యతో ట్విట్టర్లో సమాచారాన్ని ఇచ్చే కేటీఆర్ గారు మరియు పాఠశాలలకు ఎవరు రావద్దని ఆదేశాలపై ఏం చేస్తాడో వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేటీఆర్ గారి ఆదేశాలు నిజం కావాలంటే ఈ ఆదేశాలతో కేటీఆర్ గారి కల ఎలా సహకారమవుతుందనేది ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి.
అన్ని బాగుంటే భయం ఎందుకు?
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందని 20వేల పైగా ఉన్న పాఠశాలను మన ఊరు- మనబడి పథకం ద్వారా దాదాపు 7వేల కోట్ల రూపాయలతో ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెబుతూ ఉన్న ప్రభుత్వం మరి అభివృద్ధి చేసినప్పుడు ఎందుకు ఆదేశాలను జారీ చేస్తుంది.అలాగే గొప్పలు చెప్పుకుంటూ పేరు గొప్ప ఊరు దిబ్బన అనే విధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి రోజురోజుకు దినస్థితిలోకి నెట్టేస్తున్నది వాస్తవం కాదా? ఒకపక్క ఉపాధ్యాయుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న పాఠశాలల సమస్యలు అదనంగా వర్షాలు వస్తే ఊరడం ఎండాకాలంలో ఎండ కొట్టడం చలికాలంలో చలి పెట్టడం అది కేవలం ప్రభుత్వ విద్యాలయాలకు సొంతం అనే విధంగా మన రాష్ట్రంలో ఉందనేది సత్యం వాటిని వాటి సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం అధికార అవసరాల కోసం మాత్రమే ఆదేశాలను ఇచ్చి ఆ సమస్యలను కప్పి పెడుతుంది అనేది వాస్తవం కాబట్టి ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కారం చెయ్యకుండా ఆదేశాలతో సమస్యలను కప్పిపుచ్చుకోవడం సిగ్గుచేటుగా భావించాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమస్యలు పరిష్కరించి అందరూ చూడండి ఈ తెలంగాణ రాష్ట్ర విద్యారంగా అభివృద్ధి అని చెప్పాల్సిన ప్రభుత్వం చేతకాకుండా సమస్య పరిష్కరించుకోకుండా దాటవేసే ధోరణితో ఆదేశాలను ఇవ్వడం బాధాకరం కాబట్టి తక్షణమే దీనిపై తెలంగాణ సమాజం గమనించి ముందుకు పోవాలని కోరుతున్నాం.
సంఘాలను, మీడియాను, స్వచ్చంద సంస్థలను ,రాజకీయ నాయకులను రావద్దు అనే ఆదేశాలను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేక చరిత్ర కలిగి ఉంది అది తెలంగాణ సాయుధ పోరాటంలో మొదలుకొని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వారికి అనేక ఉద్యమాలు చేపట్టి విజయాలు సాధించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి కుందనేది ప్రభుత్వం గుర్తుతెరగాలి తప్పుడు కేసులతో పోలీసుల అండదండలతో అణచివేయాలని చూస్తే అది ప్రభుత్వానికి నష్టం అనేది గమనించుకోవాలి.కాబట్టి తక్షణమే ఆదేశాలు వెనక్కి తీసుకునే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మేధావులు సామాజికవేత్తలు తెలంగాణ ప్రజానీకం అందరు కలిసి ఉద్యమించాలని అలాగే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పే విధంగా ముందుకు పోయేలా కృషి చేయాలని కోరుతున్నాను.
కృతజ్ఞతలతో
వ్యాసకర్త:-
మాదం తిరుపతి
USFIరాష్ట్ర కార్యదర్శి
9491962243