జెండా పండుగకు సర్వం సిద్ధం

1
ఢిల్లీ,ఆగస్టు 14(జనంసాక్షి):

70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశమంతటా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీ, శ్రీనగర్‌, ముంబై, చెన్నైతో పాటు పలు ప్రధాన నగరాలన్ని కొత్త శోభను సంతరించుకున్నాయి. మువ్వన్నెల జెం డాలతో ఎర్రకోట కళకలలాడు తోంది. రాజ్‌ పథ్‌లో కేంద్ర ప్రభుత్వం సైనిక కవాతు, ఆర్మీ బ్యాండ్‌ ఏర్పాటు చేసింది. 50 ఆహార స్టాళ్లు, 17 పెవీలియన్లు, స మాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్‌లు కూడా సిద్ధమయ్యా యి.పంద్రాగస్టు వేడుకలను భగ్నం చేసేందుకు జిహాదీ ఉగ్రవాదులు ఎర్రకో టను టార్గేట్‌ చేశారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్త మయ్యాయి. మరోవైపు ఇక్కడి నుంచి ప్రధాని మోడీ ప్రసంగించనుండడంతో ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీ టైట్‌ చేశారు. పోలీసులు, ఎన్‌ఎస్‌జీ క మాండోలు, పారామిలటరీ బలగాలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 5వేల మంది ఢిల్లీ పోలీసులతో పాటు, ప్రత్యేక బలగాలు నిరంతరం పహారా కాస్తున్నాయి. రెడ్‌ పోర్టుకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ మళ్లించారు. సెవన్‌ ఆర్సీఆర్‌ నుంచి ఎర్రకోట వెళ్లే రోడ్డు వెంబ డి.. వందకు పైగా సీసీ కెమారాలు ఏర్పాటు చేశారు..యూపీ, శ్రీనగర్‌, భోపాల్‌, చె న్నై, బెంగుళూర్‌తో పాటు ప లు ప్రధాన నగరాల్లో కూడా తనిఖీలు చేపట్టారు పోలీసులు. రద్ధీ ప్రాంతాలతో పాటు, బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో బాంబు స్క్వాడ్‌ తో జల్లెడ పట్టారు.