జోన్ల వారీగా అమరావతి అభివృద్ధి
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్’కు పచ్చజెండా
మూడింటికి రూ. 6900 కోట్ల అంచనా వ్యయం
అమరావతి,ఆగస్టు30 : అమరావతిలోని ప్రతిపాదిత 13 జోన్లలో మూడు జోన్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్-హెచ్‌ఏఎంలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సవిూక్ష సమావేశం నిర్ణయించింది. 4, 5, 9 జోన్లను మొత్తం రూ. 6900 కోట్లతో రహదారులు, వంతెనలు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్ వంటి మౌలిక వసతులను హెచ్‌ఏఎం ద్వారా కల్పించాలని భావించింది. జోన్-4కు రూ. 817 కోట్లు, జోన్-5కు రూ. 2,383 కోట్లు, జోన్-6కు రూ. 3,714 కోట్ల వ్యయం అవుతుంది. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సీఆర్‌డీఏ సవిూక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పట్టణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల అభివృద్ధి చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ గ్రామాల్లో పరిశుభ్రత, రహదారుల నిర్మాణం వంటి వసతుల కల్పన కోసం నరేగా నిధులు వినియోగించాలని సూచించారు. న్యాయ ? శాసన – కార్యనిర్వహక వ్యవస్థల భవనాలు, ఇతర పౌర నివాస సముదాయాలను 1.47 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామని, దీనికి రూ. 11,602 కోట్లు వ్యయం కానుందని అంచనాలను వివరించారు. అమరావతిలోని శాఖమూరు పార్కు ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి నమూనాలపైనా సమావేశంలో చర్చకు వచ్చింది. 280 ఎకరాలలో ఈ పార్కును ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇరువైపులా, శాఖమూరు పార్కులో మొక్కలు నాటే కార్యక్రమం సెప్టెంబర్ రెండో వారంలో పెద్దఎత్తున చేపట్టాలని అన్నారు. అందమైన పూల మొక్కలు నాటడం ద్వారా పర్యాటకులను కట్టిపడేయొచ్చని చెప్పారు. అక్షరధామ్ నిర్మాణానికి నదీముఖంగా 30 ఎకరాలు కేటాయించాలని నిర్వహకులు కోరినట్టు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. అమెరికాలో అక్షరధామ్ నిర్మాణం పూర్తికాగానే అమరావతిలో నిర్మాణం చేపట్టనున్నారని చెప్పారు. దీనికి సానుకూలత వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి దక్షిణ భారతంలోనే తలమానికంగా నిలిచేలా అద్భుత కట్టడాన్ని నిర్మించేలా చూడాలని సూచించారు. /ూజధాని ప్రాంతంలో 10 వరకు ¬టళ్లు త్వరలో నిర్మాణానికి నోచుకుంటాయని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని ప్రముఖ విద్యాసంస్థలు అమరావతిలో అడుగుపెట్టేందుకు వచ్చే నెలలో ఒప్పందాలు చేసుకోనున్నాయని అధికారులు చెప్పారు. మరోవైపు విజయవాడలోని రాజీవ్‌గాంధీ పార్క్‌తో సహా ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, ఇంద్రకీలాద్రి తదితర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశిరచారు. కనకదుర్గమ్మవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, కేశఖండన శాల, క్యూలైన్ల ఏర్పాటు తదితర అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని చెప్పారు.