జోరుగా సమ్మర్‌ క్యాంపులు

క్యాష్‌ చేసుకుంటున్న కోచింగ్‌ సెంటర్లు
విజయవాడ,మే16(జ‌నం సాక్షి): వేసవి సెలవులను కోచింగ్‌ సెంటర్లు బాగా క్యాష్‌ చేసుకుంటున్నాయి. వివిధ రంగాల్లో కోర్సుల పేర్లతో సమ్మర్‌ కోచింగ్‌ సెంటర్లను ప్రారంభించి దండుకుంటున్నాయి. దీంతో ఈ సమ్మర్‌లో కూడా వయసుతో నిమిత్తం లేకుండా పిల్లలు ఆయా సెంటర్లకు చేరుకుంటున్నారు. విద్యార్థులకు మానసికోల్లాసాన్ని పెంపొందించడంలో క్రీడలు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. ఈ పోటీ ప్రపంచంలో
సాధారణ రోజుల్లో విద్యార్థులంతా చదువుల కోసమే కేటాయించాల్సి వస్తోంది. ఆటలు ఆడలానే ఆసక్తి ఉన్నా వారికి సమయం దొరికే పరిస్థితి లేదు. అందుకే చాలామంది సెలవుల్లో ఇష్టమైన క్రీడను ఎంపిక చేసుకొని ప్రత్యేక శిక్షణను పొందుతున్నారు. ముఖ్యంగా క్రికెట్‌, షటిల్‌, బ్యాడ్మింటన్‌, స్విమ్మింగ్‌, తదితర క్రీడాంశాలను ఎంపిక చేసుకొని అందులో నైపుణ్యాల్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కళాశాలల్లో సైతం వార్షికోత్సవాల సందర్భంగా పోటీలు నిర్వహిస్తుండటంతో అందులో రాణించాలనే లక్ష్యంతో బీటెక్‌, డిగ్రీ, ఫార్మసీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు.
నేటితరం విద్యార్థులు చదువుతోపాటు విభిన్న అంశాల్లో ప్రత్యేకతను చాటుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. సెలవులను సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ వేసవిని సద్వినియోగం చేసుకునేందుకు, ఇష్టమైన అంశాల్లో నైపుణ్యం పెంచుకునేందుకు ముందుకు సాగుతున్నారు. చిన్నచిన్న పట్టణాల్లో సైతం శిక్షణ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి స్థానిక విద్యార్థులకు ఉపయోగ కరంగా మారాయి. నచ్చిన అంశంలో మెలకువలు నేర్చుకొని రాటుదేలుతున్నారు.  కొన్ని సంస్థలు కూడా ఆయా అంశాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నాయి. క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్టీ, సాప్ట్‌బాల్‌, కరాటే తదితర క్రీడాంశాల్లో, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, కంప్యూటర్‌ కోర్సులు, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణలు అందుబాటులో ఉన్నాయి. వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత విద్యను మంచి విద్యాసంస్థల్లో చదవాలంనుకుంటున్న వారు సైతం కోచింగ్‌ సెంటర్లను ఆశ్రియస్తున్నారు. కంప్యూటర్‌ కోర్సుల్లో రోజురోజుకు మార్పులు వస్తున్నాయి. వాటికి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకుంటేనే మంచిదని భావించి  ఆధునిక కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే ఈ వేసవి సెలవుల్లో చాలామంది కంప్యూటర్‌లో అడ్వాన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకొని రాణిస్తున్నారు. సెలవులు పూర్తయ్యే నాటికి ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడేలా చాలామంది ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇక పాఠశాల స్థాయి విద్యార్థులు ఎక్కువగా వేదిక్‌ గణితం, చిత్రలేఖనం, రైటింగ్‌, తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. కొందరు కూచిపుడి, భరతనాట్యం, జానపద నృత్యం, శాస్త్రీయ సంగీతం.. నేర్చుకునేందుకు విద్యార్థులు ఈ సెలవులను వేదికగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. చదువుతున్న విద్యాసంస్థల్లో మంచి కళాకారుడిగా గుర్తింపు పొందాలనే ప్రధాన లక్ష్యంతో విద్యార్థులు పట్టుదలతో తమకిష్టమైన సాంస్కృతిక అంశాల్లో మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తున్నారు.
,,………………..

తాజావార్తలు