టమోటా రైతులకు అండగా ఉంటాం

చిత్తూరు,మే7(జ‌నంసాక్షి): జిల్లాలో టమోటా రైతులు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రాసెసింగ్‌ యూనటిట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని జడ్పీ ఛైర్‌ పర్సన్‌ గీర్వాణి స్పష్టం చేశారు. టమాటాలునిల్వ చేసేందుకు శీతల గిడ్డంగులు అవసరమన్నారు. ధరల్లో నిలకడ కోసం టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌లు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి గతంలో 10 కోట్లు మంజూరు చేశారన్నారు. అలాగే టమోటా రైతులకు  రుణమాఫీ తప్పకుండా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలావుంటే మదనపల్లి  వ్యవసాయ మార్కెట్‌లో టమోటా ధరలు రోజురోజుకు పుంజుకుంటున్నాయి.  గత కొన్నిరోజులుగా ఈ ధరల్లో మార్పు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. మార్చి నెలాఖరు నుంచి ఇక్కడి మార్కెట్‌కు సీజన్‌ ప్రారంభమవుతుంది. ప్రారంభంలో తక్కువగానే పలికిన ధరలు  పుంజుకోవడం ప్రారంభించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.  మదనపల్లె, తంబళ్ళపల్లె నియోజకవర్గాల నుంచే కాకుండా కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన రాయల్‌పాడు, శ్రీనివాసపురం నుంచి రైతులు 225 టన్నుల టమోటాను మార్కెట్‌కు తీసుకొచ్చారు. నిల్వ సామర్థ్యం ఉండేలా శీతల గిడ్డంగులు ఉంటే రైతుల కష్టాలు తీరుతాయని గీర్వాణఙ అన్నారు. అందుకు కృషి చేస్తామని అన్నారు. ఇదిలావుంటే తమిళనాడులోని తెలుగు ప్రజల దాహార్తి తీర్చేందుకు కృష్ణా జలాలను సోమశిల ప్రాజెక్టుకు తరలించి తద్వారా శ్రీకాళహస్తి విూదుగా చెన్నైకు

పంపారని పేర్కొన్నారు. ఆ తర్వాత తిరుమలకు నీరందించేందుకు తెలుగుగంగను కల్యాణి డ్యాంకు మళ్లించి అక్కణ్నుంచి తిరుమలకు సరఫరా చేసిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. అదేవిధంగా హంద్రీ-నీవా కాలువకు అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఎన్టీఆర్‌ సర్వేలు చేయించారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జలయజ్ఞం పేరిట ప్రజల్ని మోసం చేసిందని ఆరోపించారు. పొలాలకు సాగునీటిని అందిస్తామని ఆయకట్టు రైతులను నమ్మించి మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని ధ్వజమెత్తారు.

చంద్రబాబు భగీరథ ప్రయత్నం చేసి ఏడాదిలో కరవు సీమకు హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు.  రాష్ట్రంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులకు పునాది వేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం తెలుగుగంగ ప్రాజెక్టుకు ఎన్టీఆర్‌ నాంది పలికారని గుర్తుచేశారు. ..

తాజావార్తలు